Taare Zameen Par: తారే జమీన్‌ పర్‌ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా? ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరో..

|

Oct 28, 2024 | 7:06 PM

ఇటీవల తెలుగులో రిలీజైన 35.. ఒక చిన్న కథ కాదు సూపర్ హిట్ గా నిలిచింది. పిల్లల చదువులో తల్లిదండ్రుల పాత్ర అనే సున్నితమైన అంశాన్ని ఎంతో అద్భుతంగా చూపించారీ సినిమాలో. అయితే సేమ్ టు సేమ్ ఇలాంటి కాన్సెప్ట్ తో బాలీవుడ్ లో చాలా ఏళ్ల క్రితమే ఒక సినిమా వచ్చింది. అదే తారే జమీన్ పర్.

Taare Zameen Par: తారే జమీన్‌ పర్‌ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా? ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరో..
Taare Zameen Par Movie
Follow us on

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో తారే జమీన్ పర్ ఒకటి. పిల్లల పెంపకం, చదువు, తల్లిదండ్రుల పాత్ర వంటి అంశాలను ఎంతో హృద్యంగా చూపించారీ సినిమాలో. ఆమీర్ ఖాన్ ఇందులో నటించడంతో పాటు దర్శకత్వ, నిర్మాణ బాధ్యతలను కూడా భుజానకెత్తుకున్నాడు. ఇక ఈ సినిమాలో ఆమిర్ తో పోటీ పడి నటించాదు దర్శిల్ సఫారీ. . ఈ సినిమాలో నటించేటప్పటికి అతనికి పదేళ్లు కూడా నిండలేదు. కానీ తన అమాయక నటనతో అందరి కళ్లల్లో నీళ్లు తెప్పించాడు దర్శిల్. డైస్లెక్సియాతో బాధపడుతున్న ఓ పిల్లాడి పాత్రలో దర్శిల్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తర్వాత 2010లో బం బం బోలే అనే చిత్రంలో దర్శిల్‌. అలాగే 2011లో డిస్నీ జోకోమోన్ చిత్రంలో సూపర్ హీరో పాత్రను పోషించాడు. ఇలా పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి మెప్పించాడు. అలాగే ‘ఝలక్ దిఖ్లాజా’ వంటి డ్యాన్స్ రియాలిటీ షోల్లో సందడి చేశాడు. అలాగే పలు షార్ట్‌ ఫిల్మ్స్‌, మ్యూజిక్‌ వీడియోలల్లో సందడి చేశాడు. వీటితో పాటు మిడ్‌ నైట్ చిల్ర్డన్ అనే మరో సినిమాలో కూడా దర్శిల్ సఫారీ నటించి మెప్పించాడు.

కాగా తారే జమీన్ పర్ సినమాలో సన్నగా, ఎత్తు పళ్లతో అమాయకంగా కనిపించిన దర్శిల్ ఇప్పుడు హీరో రేంజ్‌కి ఎదిగిపోయాడు. హ్యాండ్సమ్ హీరోగా అచ్చం అబ్బాస్ ను తలపిస్తున్నాడు. ప్రస్తుతం దర్శిల్ హిందీతో పాటు గుజరాతీ భాషల్లో సినిమాలు చేస్తున్నాడు. ఇటీవలే ఈ హ్యాండ్సమ్ హీరో ప్యార్ నాల్ అనే సినిమాలో నటించాడు. ఇక తన సినిమా ప్రమోషన్ల కోసం ఈ మధ్యన పార్టీలు, సినిమా ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తున్నాడు దర్శిల్. దీంతో అతనిని చూసి చాలామంది ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ హీరోల్నిసైతం తలదన్నేరీతిలో కటౌట్ అదిరిపోయిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అదే జరిగితే మరో యంగ్ అండ్ గ్లామర్ హీరో బాలీవుడ్‌కి దొరికినట్లే అనుకుంటున్నారు నెటిజన్లు.

ఇవి కూడా చదవండి

దర్శిల్ సఫారీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

అప్పుడలా.. ఇప్పుడిలా..

తాజ్ మహల్ ముందు పోజులు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.