ప్రముఖ పారిశ్రామిక వేత్త, వ్యాపార దిగ్గజం రతన్ టాటా బుధవారం (అక్టోబర్ 09) అర్థరాత్రి కన్నుమూశారు. టాటా గ్రూప్ అండ్ టాటా సన్స్‌కు గౌరవ్ ఛైర్మన్ గా ఉన్న ఆయన భారతదేశ పారిశ్రామిక పురోగతికి ఎంతో కృషిచేశారు. అలాగే పలు సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టారు. భారతదేశంలోనే అత్యుత్తమ వ్యాపారవేత్తగా పేరు పొందిన రతన్ టాటా మరణం అందరినీ కలచి వేస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రతన్ టాటా మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థించారు. కాగా వ్యాపార దిగ్గజంగా పేరు తెచ్చుకున్న రతన్ టాటాకు సినిమా ఇండస్ట్రీతోనూ సంబంధం ఉంది. సినిమాలంటే ఇష్టం ఉన్న ఆయన ఓ సినిమా కూడా నిర్మించారు. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ నటించిన ఏత్ బార్ అనే చిత్రానికి రతన్ టాటా నిర్మాతగా వ్యవహరించారు. నిజానికి ఈ సినిమాకు నలుగురు నిర్మాతలు ఉన్నారు. వారిలో రతన్ టాటా ఒకరు. జతిన్ కుమార్, ఖుష్రు బుద్రా, మన్‌దీప్ సింగ్ కూడా ఈ చిత్రానికి పెట్టుబడి పెట్టారు. అయితే రతన్ టాటానే ఈ చిత్రానికి ప్రధాన నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా 2004లో విడుదలైంది. 1992లో వచ్చిన హాలీవుడ్ సినిమా ‘ఫియర్’ స్ఫూర్తితో ఏత్ బార్ సినిమా తెరకెక్కింది. విక్రమ్ భట్ దర్శకత్వం వహించారు.
ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్‌తో పాటు జాన్ అబ్రహం, బిపాసా బసు, సుప్రియా పిల్గాంకర్ తదితరులు నటించారు. 2002లో విడుదలైన ఈ సినిమా బడ్జెట్ 9.50 కోట్లు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం 7.50 కోట్లు మాత్రమే రాబట్టింది. భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్స్ ఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇక ఈ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రతన్ టాటా మళ్లీ చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టలేద. అలా మొదటి చిత్రమే ఆయన చివరి సినిమా అయ్యింది.
టాటా సంస్థ ఉప్పు తయారీ నుండి విమానం, సాఫ్ట్‌వేర్ వరకు అన్ని రకాల ఉత్పత్తులను విక్రయిస్తోంది. అయితే ప్రస్తుతం సినిమా పరిశ్రమకు మాత్రం కొంచెం దూరంగా ఉంది. అలాగనీ టాటా సంస్థ వినోద రంగంలో లేదని కాదు. Tata Sky, Tata Neo OTT, Tata Communication, Tata Play, Tejas Network ద్వారా కూడా వినోద రంగంలో కస్టమర్లకు సేవలు అందిస్తోంది టాటా సంస్థ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.