Salman Khan: ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?

Salman Khan: ఇదెక్కడి అరాచకం రా అయ్యా..! సల్మాన్ కి రూ.240 కోట్ల ఫీజా..?

Anil kumar poka

|

Updated on: Oct 10, 2024 | 3:03 PM

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటనలోనే కాదు ప్రెజెంటేషన్‌లోనూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొడుతున్నాడు సల్మాన్. ఇక సల్లూ భాయ్‌ పెర్ఫార్మెన్స్ ను పక్కకు పెడితే.. ప్రస్తుతం బిగ్ బాస్ కోసం ఈయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది. తాజాగా హిందీలో బిగ్ బాస్ సీజన్ 18 స్టార్ట్ అయింది.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటనలోనే కాదు ప్రెజెంటేషన్‌లోనూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. బిగ్ బాస్ హోస్ట్ గా అదరగొడుతున్నాడు సల్మాన్. ఇక సల్లూ భాయ్‌ పెర్ఫార్మెన్స్ ను పక్కకు పెడితే.. ప్రస్తుతం బిగ్ బాస్ కోసం ఈయన తీసుకుంటున్న రెమ్యునరేషన్ అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.

తాజాగా హిందీలో బిగ్ బాస్ సీజన్ 18 స్టార్ట్ అయింది. హోస్ట్‌గా ఈసారి కూడా సల్మానే చేస్తున్నారు. అయితే రెమ్యునరేషన్‌ విషయంలో ఎప్పుడూ తగ్గని సల్మాన్ ఖాన్.. ఈసారి కూడా ఈ విషయంలో ఎక్కడా తగ్గలేదట. బిగ్ బాస్ సీజన్ 18 కోసం సల్లూ భాయ్‌ ఒక్క నెలకే దాదాపు 60 కోట్ల రూపాయలను ఫీజ్‌గా తీసుకుంటున్నాడట. ఈ లెక్కన 4 నెలలు జరిగే ఈ షో కోసం… దాదాపు 240 కోట్ల వరకు రెమ్యునరేషన్‌గా అందుకోనున్నారట సల్మాన్. ఇక దశాబ్ద కాలంగా ఈ షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న సల్మాన్ ఖాన్ గత సీజన్లతో పోలిస్తే ఈసారి రెమ్యునరేషన్ పెంచేశాడు. అదే సమయంలో, షో హోస్ట్ చేసిన తొలినాళ్లలో సల్మాన్ రెమ్యూనరేషన్‌గా దాదాపు 10 కోట్లు తీసుకునేవారు. అయితే ఇప్పుడు దానిని రూ.240 కోట్లకు పెంచారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.