Hina khan: క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా ఖాన్.

Hina khan: క్యాన్సర్‌తో బాధపడుతున్నా.. అందుకే అలా తప్పుగా చేశా.. సారీ.: హీనా ఖాన్.

Anil kumar poka

|

Updated on: Oct 10, 2024 | 2:02 PM

బ్యూటీ లుక్స్ అండ్ యాక్టింగ్ ట్యాలెంట్‌తో బాలీవుడ్‌ బుల్లి తెర ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు హీనా ఖాన్. కెరీర్లో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న క్రమంలోనే క్యాన్సర్ తో ఒక్కసారిగా ఆమెకు బ్రేక్ తప్పలేదు. తాను బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నా అంటూ అసలు విషయం చెప్పి తన ఫ్యాన్స్ ను షాకయ్యేలా చేశారు. అయినా కానీ తన కెరీర్లో ఏ మాత్రం ఆగకుండా ఓ పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూనే..

బ్యూటీ లుక్స్ అండ్ యాక్టింగ్ ట్యాలెంట్‌తో బాలీవుడ్‌ బుల్లి తెర ఇండస్ట్రీలో స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు హీనా ఖాన్. కెరీర్లో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న క్రమంలోనే క్యాన్సర్ తో ఒక్కసారిగా ఆమెకు బ్రేక్ తప్పలేదు. తాను బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడుతున్నా అంటూ అసలు విషయం చెప్పి తన ఫ్యాన్స్ ను షాకయ్యేలా చేశారు. అయినా కానీ తన కెరీర్లో ఏ మాత్రం ఆగకుండా ఓ పక్క ట్రీట్మెంట్ తీసుకుంటూనే మరో పక్క బుల్లి తెర ఈవెంట్స్‌లో కనిపిస్తున్నారు ఈమె. ఈ క్రమంలోనే ఓ ఫ్యాషన్ వీక్‌లో తళుక్కున మెరిశారు. ఓ క్రేజీ పనితో నెట్టింట వైరల్ అయ్యారు. దాంతో పాటే ఈ ఫ్యాషన్ వీక్ డిజైనర్ మసాబాకు సారీ చెబుతూ తన ఇన్‌స్టా లో ఓ పోస్ట్ పెట్టారు ఈమె.

ఇక సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీనా ఖాన్ తాజాగా మసాబా ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్నారు. అందులో ఫ్యాషన్ డిజైనర్ మసాబా డిజైన్ చేసిన శారీని ధరించారు. అయితే సారీకి సూట్ అయ్యేలా ఫ్యాన్సీ ఫుట్ వేర్ కాకుండా.. స్పోర్ట్స్‌ షూస్ ను ధరించారు. ఇక ఇదే ఫోటోను తన ఇన్‌స్టాలో షేర్ చేసిన హీనాఖాన్.. ఇలా మిస్ మ్యాచ్ షూ ధరించి చీర అందాన్ని చెడగొట్టినందుకు డిజైనర్‌ మసాబాకు సారీ చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.