Bobby Deol: ‘యానిమల్’ విలన్ ఎన్ని కోట్లకు అధిపతి తెలుసా ?.. బాబీ డియోల్ సంపాదన ఎంతంటే..

ఈ సినిమాలో రణభీర్ కపూర్, రష్మిక మందన్నాతోపాటు.. విలన్ పాత్రలో నటించిన బాబీ డియోల్ సైతం పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నారు. ఇందులో బాబీ తన నటనతో విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. ఇంతకీ బాబీ డియోల్ ఎవరు ?.. బ్యాగ్రౌండ్ ఏంటీ ?.. అనే విషయాలు తెలుసుకుందామా. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర చిన్న కుమారుడు బాబీ. 1977లో 'ధరమ్ వీర్' చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన బాబీ.. ఆ తర్వాత 1995లో 'బర్సాత్'సినిమాతో హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.

Bobby Deol: యానిమల్ విలన్ ఎన్ని కోట్లకు అధిపతి తెలుసా ?.. బాబీ డియోల్ సంపాదన ఎంతంటే..
Bobby Deol

Updated on: Dec 10, 2023 | 8:32 PM

ప్రస్తుతం యానిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టిస్తోంది. ఇప్పటివరకు ఈసినిమా దాదాపు రూ. 800 కోట్లు వసూళ్లు రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాలో రణభీర్ కపూర్, రష్మిక మందన్నాతోపాటు.. విలన్ పాత్రలో నటించిన బాబీ డియోల్ సైతం పాన్ ఇండియా స్టార్ డమ్ అందుకున్నారు. ఇందులో బాబీ తన నటనతో విమర్శకులు ప్రశంసలు అందుకున్నాడు. ఇంతకీ బాబీ డియోల్ ఎవరు ?.. బ్యాగ్రౌండ్ ఏంటీ ?.. అనే విషయాలు తెలుసుకుందామా. బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర చిన్న కుమారుడు బాబీ. 1977లో ‘ధరమ్ వీర్’ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కనిపించిన బాబీ.. ఆ తర్వాత 1995లో ‘బర్సాత్’సినిమాతో హీరోగా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అంతేకాకుండా ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న బాబీ.. ఇప్పుడు ‘యానిమల్’ సినిమా విజయాన్ని ఆస్వాదిస్తున్నాడు.

బాబీ డియోల్ యానిమల్ మూవీతో గ్రాండ్ రీఎంట్రీ ఇఛ్చాడు. ఈ చిత్రంలో అబ్రార్ హక్ పాత్రను పోషించడానికి అతను దాదాపు రూ.4 నుండి 5 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. డీఎన్‌ఏ నివేదిక ప్రకారం బాబీ డియోల్ నికర విలువ రూ.66 కోట్లు. బాబీ వయసు ప్రస్తుతం 54 ఏళ్లు. అతడు తన తండ్రి ధర్మేంద్రకు చెందిన విజయతా ఫిల్మ్స్ సంస్థను చూసుకుంటున్నారు. ఈ బ్యానర్ పై పలు చిత్రాలను నిర్మించడం ద్వారా కూడా సంపాదిస్తున్నాడు. అతను విజయతా ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఘయల్, దిల్లగి, పాల్ పల్ దిల్ కే పాస్ వంటి చిత్రాలు నిర్మించారు. డియోల్స్ భారతదేశంలోని అత్యంత సంపన్న కుటుంబాలలో ఒకరు. అనే వ్యాపార వెంచర్లలో పెట్టుబడి పెట్టారు బాబీ. అలాగే అతడికి అనేక రెస్టారెంట్స్ ఉన్నాయి. అలాగే వివిధ సంస్థలలో వాటాలను కలిగి ఉన్నారు.

అంతేకాకుండా బాబీ డియోల్ కు ముంబైలో సుమారు 6 కోట్ల రూపాయల విలువైన విలాసవంతమైన ఇల్లు ఉంది. ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి బాబీ నివసిస్తున్న ఈ ఇల్లు ముంబైలోని విలే పార్లే ప్రాంతంలో ఉంది. బాబీ డియోల్ పెట్రోల్ హెడ్, వివిధ విలాసవంతమైన కార్లు ఉన్నాయి. అలాగే ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ నుంచి మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్ వరకు ఉన్నాయి.

బాబీ డియోల్ కార్స్ కలెక్షన్..

పోర్స్చే కెయెన్ SUV
ల్యాండ్ రోవర్ ఫ్రీలాండర్ 2
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్
Mercedes-Benz S-క్లాస్
ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ స్పోర్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.