
కొంతకాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ కఠిన పరిస్థితులను ఎదుర్కోంటున్న సంగతి తెలిసిందే. వరుస డిజాస్టర్లతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. యంగ్ హీరోస్ చిత్రాలకే కాదు.. స్టార్స్ సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోలేకపోయాయి. అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్ చిత్రాలు నిరాశపరిచాయి. ఇక ఇటీవల డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన బ్రహ్మస్త్ర మాత్రమే కొద్ది కలెక్షన్స్ రాబట్టి.. బీటౌన్ నిర్మాతలకు కొత్త ఆశలు కల్పించింది. అయితే బాలీవుడ్ ఎదుర్కొంటున్న పరిస్థితికి వారసత్వం.. ప్రముఖ హీరోస్, ప్రొడ్యూసర్స్ కారణమంటూ గతంలో పలువురు సినీ ప్రముఖులు విమర్శలు గుప్పించారు. ఇందులో డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి కూడా ఒకరు. తాజాగా మరోసారి బీటౌన్ ఇండస్ట్రీపై నిప్పులు చెరిగారు డైరెక్టర్ వివేక్. ఆయన రూపొందించిన ది కాశ్మీర్ ఫైల్స్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. తన మనసులోని మాటలను ముక్కుసూటిగా చెప్పేస్తూ… పలు కాంట్రావర్సీలకు కారణమయ్యారు వివేక్. ఇక ఇప్పుడు మరోసారి ఇండస్ట్రీలోని పెద్దలకు పరొక్షంగా చురకలు అంటించారు.
ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ నెట్టింట వైరలవుతుంది. తన ట్వీట్ ద్వారా బాలీవుడ్ మొత్తాన్ని వివేక్ మరోసారి టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఎప్పుడూ లాజిక్ లేకుండా మాట్లాడే ఆయన.. ఈసారి మాత్రం లాజిక్.. మ్యాథ్స్ వివరిస్తూ ట్వీట్ చేశారు. ” స్టార్స్ లేని 4 చిన్న సినిమాలు.. బాక్సాఫీస్ వద్ద మార్కెటింగ్ లేదా డిస్ట్రిబ్యూషన్ మద్దతు లేని కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, కాంతార, రాకెట్రీ చిత్రాలు దాదాపు రూ. 800 కోట్లు రాబట్టాయి. ఈ నాలుగు చిత్రాల నిర్మాణ వ్యయం కేవలం రూ. 75 కోట్ల లోపే. బాలీవుడ్ ఇండస్ట్రీ గుడ్డివారు.. చెవిటివారు.. మూగవారు ఈ చిన్న లెక్కను అర్థం చేసుకోలేరు ? ” అంటూ రాసుకోచ్చారు. ప్రస్తుతం వివేక్ చేసిన ట్వీట్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
అయితే ఆయన చేసిన ట్వీట్ పై నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాకెట్రీ సినిమాలో ఆర్ మాధవన్ నటించారని.. ఆయన సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అని.. అలాంటి నటుడు నటించిన సినిమాను స్టార్ లేని సినిమా అని చెప్పడం తప్పు అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశారు. మరికొందరు వివేక్ కు మద్దతు తెలుపుతున్నారు.
ట్వీట్..
4 small films with no stars, no marketing or distribution support – #TheKashmirFiles, #Kartikeya2, #Kantara & #Rocketry earned approx 800 Cr at BO. Total cost of production of 4 films under 75 cr.
Is Bollywood blind, deaf & dumb that they don’t understand simple maths and learn?
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) October 28, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.