
కుష్టు వ్యాధి.. ఇప్పుడంటే దీనికి మందులు ఉన్నాయి. ప్రజల్లో కూడా ఈ వ్యాధి గురించి పూర్తి అవగాహన ఉంది. కానీ కొన్నేళ్ల క్రితం కుష్టు వ్యాధి బారిన పడిన వారిపై చాలా చిన్నచూపు ఉండేది. సమాజంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొనేవారు. ఈ స్టార్ హీరోయిన్ ది కూడా సేమ్ ఇదే కథే. 12 ఏళ్ల వయసులోనే కుష్టు వ్యాధి బారిన పడిన ఆమె కుటుంబ సభ్యుల నుంచే అవమానాలు ఎదుర్కొంది. స్కూల్ లో నుంచి తీసేయాలన్న బెదిరింపులు వచ్చాయి. కానీ వీటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్న ఆమె 14 ఏళ్ల వయసులోనే స్క్రీన్ టెస్ట్ కు హాజరైంది. తన ఎక్స్ ప్రెషన్స్ తో డైరెక్టర్‌ని ఇంప్రెస్ చేసింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తన అందం, అభినయంతో ఆడియెన్స్ ను అలరించింది. అయితే చిన్న వయసులోనే ఓ స్టార్ సెలబ్రిటీని పెళ్లి చేసుకుంది. 17 ఏళ్ల వయసులోనే తల్లైంది. ఆతర్వాత కొన్ని సంవత్సరాలకే భర్తతో విడాకులు తీసుకుంది. దీంతో ఆమె కెరీర్ కు ఫుల్ స్టాప్ పడినట్టేనని చాలా మంది భావించారు. కానీ గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చింది. విడాకుల తర్వాతే అసలైన ప్రయాణాన్ని స్టార్ట్ చేసింది. స్టార్ హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీని శాసించింది. స్టార్ హీరోలతో కలిసి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ సినిమాలు చేస్తోన్న ఆ అందాల తార మరెవరో కాదు డింపుల్ కపాడియా.
రాజ్ కపూర్ హీరోగా నటించిన ‘బాబీ’ సినిమాతో పేరు తెచ్చుకుంది డింపుల్ కపాడియా. కానీ 16 సంవత్సరాల వయసులోనే నటుడు రాజేష్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్న డింపుల్ 17 సంవత్సరాలకే తల్లైంది. ట్వింకిల్ ఖన్నా అనే కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే విడాకుల తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభించిన ఈ అందాల తార ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇప్పటికీ సినిమాల్లో నటిస్తూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.
కాగా డింపుల్ కపాడియా కూతుర్లు ట్వింకిల్ ఖన్నా, రింకీ ఖన్నా కూడా సినిమాల్లో సక్సెస్ అయ్యారు. ట్వింకిల్ ఖన్నా తెలుగులో వెంకటేష్ సరసన శీను అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. హిందీలోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమె బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.