Cinema: సెన్సార్ బోర్డ్ నుంచి ఏకంగా 150 క‌ట్స్.. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు స్టే.. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది?

ఈ సినిమా టీజర్, ట్రైలర్ తోనే ఎన్నో వివాదాలు చెలరేగాయి. ఇందులో వివాదాస్పద ప్రకటనలు, సన్నివేశాలు ఉన్నాయని చాలా మంది అభ్యంతరాలు లేవనెత్తారు. ఈ సినిమాను చూసిన సెన్సార్ బోర్డు ఏకంగా 150 కట్స్ సూచించినట్లు సమాచారం. ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ పైనే హైకోర్టు స్టే విధించింది.

Cinema: సెన్సార్ బోర్డ్ నుంచి ఏకంగా 150 క‌ట్స్.. ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు స్టే.. ఇంతకీ ఈ సినిమాలో ఏముంది?
Udaipur Files Movie

Updated on: Jul 11, 2025 | 7:07 PM

‘కశ్మీర్ ఫైల్స్’, ‘ది కేరళ ఫైల్స్’ తరహాలో తెరకెక్కిన ‘ఉదయ్‌పూర్ ఫైల్స్’ సినిమా శుక్రవారం (జూలై 11) విడుదల కావాల్సి ఉంది. కానీ ఢిల్లీ హైకోర్టు ఈ సినిమా విడుదలపై స్టే విధించింది. ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది, కానీ ఈ పిటిషన్‌ను త్వరగా విచారించాలని చెప్పిన సుప్రీంకోర్టు ‘సినిమాను విడుదల చేయనివ్వండి’ అని చెప్పింది. కానీ ఢిల్లీ హైకోర్టు ఈ సినిమా విడుదలపై స్టే విధించింది. 2022లో రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో జరిగిన దర్జీ కన్హయ్య లాల్ హత్య కేసు ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. గురువారం (జులై 11) ఈ సినిమా రిలీజ్ పై ఢిల్లీ హైకోర్టులో దాదాపు ఐదు గంటల పాటు వాదనలు జరిగాయి, చివరకు జస్టిస్ డీకే ఉపాధ్యాయ్ సినిమా విడుదలను నిలిపివేసి, ఈ విషయంలో కేంద్రం నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కట్ సీన్లతో సహా CBFC నుంచి ఎటువంటి సర్టిఫికేషన్ లేకుండా ఈ సినిమా ట్రైలర్, టీజర్‌ను యూట్యూబ్‌లో విడుదల చేసినందుకు కోర్టు చిత్ర నిర్మాతలను మందలించింది. ఇది సినిమాటోగ్రఫీ చట్టాన్ని ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది.

 

ఫిర్యాదుదారుడి తరపున వాదించిన సీనియర్ న్యాయవాది మాట్లాడుతూ, “ఈ సినిమా ట్రైలర్‌లో చాలా అభ్యంతరకర ప్రకటనలు, సన్నివేశాలు ఉన్నాయి. కన్హయ్య లాల్ హత్య కేసుకు వీటితో ఏం సంబంధం ఉంది? మీరు ఈ సినిమా చూసి మీరే తీర్పు చెప్పండి, ఈ సినిమాలో చాలా ద్వేషపూరిత అంశాలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా దేశానికి మంచిది కాదు’ అని అన్నారు. దీని తర్వాత సినిమా దర్శకుడు భరత్ శ్రీనేట్ స్పందిస్తూ.. “ఇది మతాన్ని లేదా వ్యక్తిగత విశ్వాసాన్ని ఉద్దేశించిన సినిమా కాదు. ఇది ఒక సత్యం గురించి మాట్లాడే చిత్రం. ఎటువంటి ద్వేషాన్ని రెచ్చగొట్టే కంటెంట్ ఇందులో ఉండదు. ఈ సినిమా అందరూ చూడాల్సిన చిత్రమని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

కాగా ఉదయ్ పూర్ ఫైల్స్ సినిమాపై నిషేధం తర్వాత కన్హయ్య లాల్ కుమారుడు మాట్లాడుతూ, “తన తండ్రి హత్య జరిగి మూడు సంవత్సరాలు అయింది. ఈ దారుణానికి సంబంధించి వీడియో ఆధారాలు అందుబాటులో ఉన్నాయి. కానీ బాధ్యులకు ఇంత వరకు శిక్ష పడలేదు. తన తండ్రి హత్య గురించి సినిమా తీసి ప్రపంచానికి నిజం చూపిస్తుంటే, ఆ సినిమా విడుదలపై నిషేధం విధించారు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..