Aryan Khan Drugs Case: క్రూయిజ్ షిప్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు మరోసారి చుక్కెదురయింది. ఆర్యన్ పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే బెయిల్ పిటిషన్ వేసుకున్న ఆర్యన్‌ఖాన్‌తో పాటు.. ఆర్బాజ్, దమేచకు కూడా బెయిల్ నిరాకరించింది. దీంతో.. ఆర్యన్ ఖాన్‌ను 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఇక గురువారంతో ఆర్యన్ సహా 8 మందికి ఎన్సీబీ కస్టడీ ముగియడంతో కోర్టు తిరిగి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. మరోవైపు ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ తిరస్కరణతో ఎన్సీబీ కస్టడీ కింద ఆర్యన్ ఖాన్ ముంబైలోని ఆర్ధర్ రోడ్డు జైలులో గడపనున్నారు.
క్రూయిజ్‌లో డ్రగ్స్ పార్టీ కేసుపై ముంబై కోర్టులో గురువారం వాడివేడి వాదనలు జరిగాయి. ఆర్యన్‌తో పాటు అరెస్టయిన 8 మందిని ఎన్సీబీ అధికారులు కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసును మరింత లోతుగా విచారించాలని, అక్టోబర్ 11 వరకు ఆర్యన్ కస్టడీని పొడిగించాలని ఎన్సీబీ అధికారులు కోరారు. దీంతో బెయిల్‌ను నిరాకరిస్తూ కోర్టు తీర్పును వెలువరించింది.
Mumbai | NCB brings Aryan Khan and other accused in the cruise ship drug raid case to Arthur Jail pic.twitter.com/uow3Ukaj0Z
— ANI (@ANI) October 8, 2021
ఇదిలా ఉంటే ముంబై నుంచి గోవా వెళుతున్న క్రూయిజ్‌లో ఆదివారం జరిగిన రేవ్ పార్టీపై ఎన్సీబీ అధికారుల దాడిలో ఆర్యన్ ఖాన్ సహా మరికొంత మంది డ్రగ్స్‌తో పట్టుబడిన విషయం తెలిసందే. వీరి నుంచి భారీమొత్తంలో మత్తుపదార్ధాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: Samantha: ‘కుంగుబాటు నుంచి కోలుకునేందుకు కొంత టైమ్ ఇవ్వండి’.. సమంత భావోద్వేగ లేఖ
Air India Sale: ఎయిరిండియా చరిత్రలో మరో కొత్త అధ్యాయం.. 68 ఏళ్ల తర్వాత మళ్లీ టాటా గ్రూప్ చేతికి..