Udit Narayan: మరో వివాదంలో స్టార్ సింగర్.. ఉదిత్ నారాయణ్‌పై కేసు పెట్టిన మాజీ భార్య.. కారణమిదే

బాలీవుడ్ స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్ ను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల తన మ్యూజిక్ కన్సర్ట్ కు హాజరైన మహిళా అభిమానులను అతను ముద్దు పెట్టుకోవడం తీవ్ర వివాదాస్పమైంది. చాలామంది ఈ స్టార్ సింగర్ ప్రవర్తనా తీరును తప్పు పట్టారు.

Udit Narayan: మరో వివాదంలో స్టార్ సింగర్.. ఉదిత్ నారాయణ్‌పై కేసు పెట్టిన మాజీ భార్య.. కారణమిదే
Udit Narayan

Updated on: Feb 24, 2025 | 1:25 PM

బాలీవుడ్ స్టార్ సింగర్ ఉదిత్ నారాయణ్ ఇటీవల వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. ఇటీవల ఒక సంగీత కచేరీలో మహిళా అభిమానులను ముద్దు పెట్టుకుని హాట్ టాపిక్ గా మారారు ఉదిత్. దీనికి సంబంధించి ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో కూడా ఉదిత్ పై పోలీస్ కేసు నమోదైంది. ఈ కేసు పెట్టింది మరెవరో కాదు, ఆయన మాజీ భార్య రంజనా ఝా. ఉదిత్ నారాయణ్ తన ప్రాథమిక హక్కులను కాలరాశారని, తన ఆస్తులను అక్రమంగా ఆక్రమించారని రంజనా ఆరోపించింది. ఈ మేరకు ఉదిత్ నారాయణ్ ఫ్యామిలీ కోర్టులో విచారణకు హాజరయ్యారు. అయితే ఈ విషయంలో తాను కరెక్ట్ గానే ఉన్నానని, ఎలాంటి రాజీకి సిద్ధంగా లేనని ఉదిత్ న్యాయమూర్తితో చెప్పారు. ‘రంజన నా నుంచి డబ్బు వసూలు చేయడానికి ప్రయత్నిస్తోందంటూ ఆమెపై ఆరోపణలు గుప్పించారు.

కాగా గతంలో ఉదిత్ రంజనాకు నెలకు 15 వేల రూపాయలు ఇచ్చేవారట. 2021లో దానిని 25 వేల రూపాయలకు పెంచారట. ఇది కాకుండా, ఉదిత్ రంజనాకు రూ.1 కోటి విలువైన భూమి, ఇంటిని ఇచ్చారట. 25 లక్షల విలువైన ఆభరణాలను కూడా ఇచ్చారట. అయితే రంజనా దానిని అమ్మేసిందని ఉదిత్ ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అదే సమయంలో రంజనా మాట్లాడుతూ.. ‘ఉదిత్ నన్ను పట్టించుకోలేదు.’ భూమి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులో 18 లక్షల రూపాయలను ఆయన దగ్గరే పెట్టుకున్నారు .నేను ముంబైకి వచ్చిన ప్రతిసారీ బెదిరింపులను ఎదుర్కొంటున్నాను’ ఆవేదన వ్యక్తం చేసింది. ఉదిత్, రంజనా 1984 లో వివాహం చేసుకున్నారు. అయితే ఆ తర్వాత వారి సంబంధంలో మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో వారు విడిపోయారు. ఉదిత్ తనను ఒంటరిగా చేస్తున్నాడని రంజనా ఆరోపించింది. అయితే మొద‌టి వివాహం గురించి ఉదిత్ చాన్నాళ్ల పాటు చాటుగానే ఉంచాడ‌ట‌. దీంతో ఆమె కోర్టును ఆశ్ర‌యించి, డైవోర్స్ ను సెటిల్ చేసుకుంద‌ట. అప్పుడు ఉదిత్ ఆమెకు భ‌రణం కింద ఇళ్లు, కొంత స్థ‌లంతో పాటు కొంత బంగారం ఇచ్చాడ‌ట‌.

నా ఆస్తిని ఆక్రమించుకున్నారు..

మ్యూజిక్ కన్సర్ట్ లో ఉదిత్ నారాయణ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.