Bollywood: సినిమాలను కేవలం వినోదాత్మకంగా నే చూడాలని కొందరు అంటే.. మరికొందరు.. మనిషికి సమాజానికి మధ్య వారధి సినిమాలు అని వ్యాఖ్యానిస్తారు. అయితే గత కొంతకాలంగా సినీ ప్రేక్షకుల మనోభావాలు మరీ సెన్సిటివ్‌గా మారిపోయాయి. లేటెస్ట్‌గా కాళీ మూవీ పోస్టర్ విషయంలో పెద్ద వివాదామే జరుగుతోంది. ఈ పోస్టర్‌లో ఓ కాళీ మాత అలంకరణలో ఉన్న ఓ అమ్మాయి సిగరెట్ తాగుతున్నట్టుగా చూపించటంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆల్రెడీ ఈ వివాదం కోర్టుకు కూడా చేరింది. దీంతో గతంలో ఇలాంటి రచ్చకు కారణమైన సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు ఆడియన్స్.
భగవంతుడు, భక్తి నేపథ్యంలో రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్న బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. ఓ మైగాడ్ సినిమాతో బిగ్ హిట్ అందుకున్న అక్కీ.. అదే రేంజ్‌లో విమర్శలను కూడా ఎదుర్కొన్నారు. ఆ మధ్య ఓ మైగాడ్ మూవీకి సీక్వెల్ ఎనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో అక్షయ్ శివుడిగా కనిపిస్తారని ముందే ఎనౌన్స్ చేసిన మేకర్స్ పోస్టర్‌లో అక్కీని బ్లూ కలర్‌లో చూపించారు. దీంతో విమర్శలు మొదలయ్యాయి.
అక్షయ్ కుమార్ చేస్తున్న మరో రిలీజియస్ కాన్సెస్ట్ మూవీ రామ్ సేతు. రామాయణ కాలం నాటి వారధి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పోస్టర్ కూడా వివాదాస్పదమైంది. పోస్టర్‌లో నిజమా.. కల్పనా? అంటూ కామెంట్ యాడ్ చేయటంపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
మరో బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా ఇలాంటి వివాదంలో చిక్కుకున్నారు. అజయ్ స్వయంగా డైరెక్ట్ చేసిన శివాయ్ మూవీ పోస్టర్ మీద పెద్ద రచ్చే జరిగింది. మంచు కొండల్లో శివుడి ఆకారం ఉన్నట్టుగా డిజైన్ చేసిన పోస్టర్‌లో అజయ్ షూస్‌తో కనిపించటం మీద పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
రీసెంట్‌గా బ్రహ్మాస్త్ర టైలర్ మీద కూడా ఇలాంటి కాంట్రవర్సీనే జరిగింది. ట్రైలర్‌లో రణబీర్ కపూర్ షూస్‌తో గుడిలోకి వెళ్లినట్టుగా చూపించారు. దీంతో ఏకంగా బాయ్‌కాట్ బాలీవుడ్ అన్న హ్యాష్ ట్యాగ్ నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అయ్యింది.
సిల్వర్ స్క్రీన్ మీదే కాదు… డిజిటల్‌లోనూ బాలీవుడ్ తరుచూ రిలీజియస్ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంది. తాండవ్, ఆశ్రమ్ లాంటి వెబ్ సిరీస్‌ల విషయంలో కూడా సోషల్ మీడియా పెద్ద చర్చే జరిగింది. ఇలా బాలీవుడ్ తరుచూ మతపరమైన అంశాలతో వివాదాల్లో చిక్కుకుంటూ ఉండటంతో.. పబ్లిసిటీ కోసమే ఇలాంటి పనులు చేస్తున్నారా అన్న చర్చ కూడా జరుగుతోంది.