Alia Bhatt: “నిన్ను ప్రశంసించడానికి మాటలు సరిపోవు”.. ఆలీయా భట్‌పై ప్రశంసలు కురిపించిన బిగ్‌బీ..
Alia Bhatt: బాలీవుడ్ టాప్ నటీమణుల్లో ఆలీయా బట్ ఒకరు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ నటి. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ...
Alia Bhatt: బాలీవుడ్ టాప్ నటీమణుల్లో ఆలీయా బట్ ఒకరు. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొన్ని రోజుల్లోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుందీ నటి. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తూ మంచి విజయాలను అందుకుంది. ఇలా ఆలీయ నటించిన గొప్ప పాత్రల్లో గంగూబాయి ఒకటి. ‘గంగూబాయి కతియావాడి’ సినిమాలో తన అద్భుత నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది.
ముంబయిలోని కామతిపుర రాజ్యానికి మాఫియా క్వీన్‌గా ఎదిగిన గంగూబాయి పాత్రలో ఆలీయా నటనకు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. తోటి నటీ, నటులు కూడా ఆలీయాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ జాబితాలోకి బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ కూడా వచ్చి చేరారు. ఆలీయా నటనపై ప్రశంసలు కురిపిస్తూ.. ఒక లెటర్‌ను పంపించారు.
అమితాబ్ పంపిన లెటర్‌ను అభిమానులతో పంచుకుంటూ ఆలీయా ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసింది. ఆ లేఖలో అమితాబ్ ఆలీయా నటనను ప్రస్తావిస్తూ.. ‘ఆలీయా గంగుబాయి పాత్రలో అద్భుతంగా నటించావు. నీ నటనను ప్రశసించడానికి మాటలు సరిపోవు’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో బిగ్‌బీ లాంటి బడా స్టార్ తన నటనపై ప్రశంసలు కురిపించడంతో ఆలీయా ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆలీయా, అమితాబ్‌తో కలిసి బ్రహ్మస్త్ర సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 9న విడుదల కానుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..
By-polls Schedule: మూడు అసెంబ్లీ సీట్ల ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. మే 31న పోలింగ్
WhatsApp: వాట్సాప్‌లో పొరపాటున కూడా ఈ పని చేయకండి.. 18.05 లక్షల అకౌంట్స్ మాయం..!