
బాలీవుడ్ లో యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కథ గురించి అందరికి తెలుసు.. అతి తక్కువ సమయంలో ఎక్కువ క్రేజ్న తెచ్చుకున్న హీరోల్లో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఒకరు . స్మాల్ స్క్రీన్ నుంచి కెరీర్ ప్రారంభించిన సుశాంత్ బాలీవుడ్ లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని ఈ లోకం, విడిచి వెళ్ళిపోయాడు. బాలీవుడ్‌కి అనేక హిట్ సినిమాలను అందించాడు సుశాంత్. సుశాంత్ చనిపోయిన తర్వాత కూడా అతన్ని ఎవరూ మర్చిపోలేకపోతున్నారు. అయితే సుశాంత్ మరణం పై ఇప్పటికీ చాలా అనుమానాలు ఉన్నాయి. కాగా బాలీవుడ్ సుశాంత్ ను పక్కన పెట్టేసిందని.. బాలీవుడ్ పెద్దల కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు సుశాంత్ మాదిరిగానే మరో హీరోను కూడా బాలీవుడ్ టార్గెట్ చేసిందని ఓ స్టార్ సింగర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ అమాల్ మాలిక్ ఇన్ డైరెక్ట్ గా యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ను బాలీవుడ్ టార్గెట్ చేసిందని చెప్పాడు. ఇండైరెక్ట్‌గా ఆయనను చంపేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని చెప్పి షాక్ ఇచ్చాడు. సుశాంత్ ను ఎలా చేశారో కార్తీక్ ను కూడా అలానే పక్కన పెట్టి మానసికంగా హింసించి చంపాలని ప్లాన్ చేస్తున్నారు. కావాలనే నిర్మాతలు అతన్ని పక్కన పెట్టేస్తున్నారని అన్నాడు.
ఈ కామెంట్స్ ఇప్పుడు బాలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. సుశాంత్ లానే కార్తీక్ ను కూడా నిర్మాతలు సైడ్ చేస్తున్నారని.. కానీ కార్తీక్ తన స్మైల్ తోనే సమాధానం ఇస్తున్నాడు. కార్తీక్ కు బ్యాక్ లో సపోర్టింగ్ సిస్టం ఉంది. కార్తీక్ నిలదొక్కుకొని వెళ్లగలడు.. తల్లి, తండ్రి, ఫ్రెండ్స్ మొత్తం తనతో ఉన్నారని.. కాబట్టి అతను ఇవన్నీ తట్టుకోగలడు అని చెప్పాడు. కానీ సుశాంత్ విషయంలో ఇలా జరగలేదు.. బాలీవుడ్ ఆడిన గేమ్ లో సుశాంత్ బలయ్యాడు. సుశాంత్ ను చంపారా లేదా చనిపోయాడా అనేది ఆ దేవుడికే తెలుసు అంటూ చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి