Swara Bhaskar: మొన్న సల్మాన్ ఖాన్ (Salman Khan) కు ఎదురయిన బెదిరింపులు ఘటనను మరచిపోకముందే, తాజాగా మరో బాలీవుడ్ నటిని చంపేస్తామంటూ కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు లేఖను రాశారు. సామాజిక అంశాలపై తనదైన శైలిలో స్పందించే ప్రముఖ నటి స్వరాభాస్కర్ (Swara Bhaskar)ను హతమారుస్తామంటూ ఆమె ఇంటికి లేఖను పంపించారు. మహారాష్ట్రలోని వెర్సోవాలో ఉన్న ఆమె నివాసానికి స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ బెదిరింపు లేఖను పంపారు. దీనిపై స్వరా భాస్కర్ వెర్సోవా పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీర్ సావర్కర్‌ను అవమానిస్తే దేశ యువత సహించబోదంటూ హిందీలో ఉన్న ఆ లేఖలో పేర్కొన్నారు. వీర్ సావర్కర్‌ను అవమానిస్తే దేశ యువత సహించబోదంటూ హిందీలో ఈ లేఖను రాశారు ఆగంతకులు.
సావర్కర్‌కు వ్యతిరేకంగా పోస్టులు పెట్టినందుకే..
కాగా సోషల్ మీడియాలో తరచూ పలు అంశాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో ఉంటుంది స్వరా భాస్కర్. 2017లో ఆమె వీరసావర్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఓ వెబ్‌సైట్‌లో వచ్చిన కథనంపై స్పందిస్తూ .. ‘జైలు నుంచి బయటకు రావడానికి బ్రిటిష్ ప్రభుత్వానికి సావర్కర్ క్షమాపణలు చెప్పారు. అందువల్ల ఆయన ‘వీర్’ ఎప్పటికి కాదు’ అని ట్విట్టర్‌లో రాసుకొచ్చింది. అనంతరం వీర్ సావర్కర్‌పై మరో ట్వీట్ కూడా చేసింది. ఈ పోస్టులు అప్పట్లో పెనుదుమారం లేపాయి. ఈక్రమంలోనే కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను చంపేస్తామంటూ లేఖను రాశారు. సావర్కర్‌కు వ్యతిరేకంగా పోస్ట్ పెట్టినందుకు ఆమెను చంపేస్తామంటూ పరుష పదుజాలంతో ఈ లేఖను రాశారు ఆ లేఖలో వాడారు. ఆయనకు వ్యతిరేకంగా ఏ వ్యాఖ్యలు చేసినా సహించబోమని హెచ్చరించారు. ఇది దేశానికి చెందిన యువతరాసిన లేఖంటూ చివర్లో పేర్కొన్నారు. తాజాగా ఉదయ్ పూర్ లో జరిగిన దర్జీ హత్యపై కూడా స్వరా భాస్కర్ స్పందించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..