Sushmita Sen: అందుకే ఇప్పటివరకు పెళ్లిచేసుకోలేదు.. రిలేషన్‌షిప్‌పై సుస్మిత ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Sushmita Sen: 'సోనియా.. సోనియా.. స్వీటు స్వీటు సోనియా' అంటూ రక్షకుడు సినిమాలో నాగార్జున సరసన సుస్మితాసేన్‌ (Sushmita Sen) చేసిన సందడి చాలామందికి గుర్తుంటుంది. దీంతో పాటు యాక్షన్ కింగ్‌ అర్జున్ నటించిన ఒకే ఒక్కడు..

Sushmita Sen: అందుకే ఇప్పటివరకు పెళ్లిచేసుకోలేదు.. రిలేషన్‌షిప్‌పై సుస్మిత ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Sushmita Sen

Edited By:

Updated on: Jul 03, 2022 | 6:53 AM

Sushmita Sen: ‘సోనియా.. సోనియా.. స్వీటు స్వీటు సోనియా’ అంటూ రక్షకుడు సినిమాలో నాగార్జున సరసన సుస్మితాసేన్‌ (Sushmita Sen) చేసిన సందడి చాలామందికి గుర్తుంటుంది. దీంతో పాటు యాక్షన్ కింగ్‌ అర్జున్ నటించిన ఒకే ఒక్కడు సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. 1994లో విశ్వసుందరి కిరీటాన్ని గెల్చుకుని ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ అందాలతార బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందింది. ఇదిలా ఉంటే బాలీవుడ్‌లో నాలుగుపదుల వయసు దాటినా పెళ్లిపీటలెక్కని ముద్దుగుమ్మల్లో సుస్మిత ఒకరు. అయితే ఇద్దరు పిల్లలను మాత్రం దత్తత తీసుకుని తన మంచి మనసును చాటుకుంది. 2015 తర్వాత సిల్వర్‌స్ర్కీన్‌పై కనిపించని ఈ సొగసరి తన వ్యక్తిగత విషయాలతో వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ముఖ్యంగా తన బాయ్‌ఫ్రెండ్‌తో రిలేషన్‌ షిప్‌, బ్రేకప్‌ వార్తలతో బాగా పాపులర్‌ అయింది. ఇదిలా ఉంటే తాను ఏడడుగులు వేయకపోవడానికి కారణమేంటో తాజాగా చెప్పుకొచ్చింది సుస్మిత. అక్షయ్‌ కుమార్‌ సతీమణి ట్వింకిల్‌ ఖన్నా హోస్ట్ చేస్తున్న ‘ట్వీక్‌ ఇండియా: ది ఐకాన్స్‌’ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె వివాహ బంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

దేవుడు మమ్మల్ని కాపాడుతున్నాడు..

ఇవి కూడా చదవండి

‘ జీవితంలో నేను చాలా ఆసక్తికరమైన వ్యక్తులను కలుసుకున్నాను. అయితే నేను ఎప్పుడూ పెళ్లి గురించి ఆలోచించలేదు. దీనికి కారణం నా పిల్లలు ఏ మాత్రం కాదు. నా పిల్లలతో నాకు ఎప్పుడు మంచి సాన్నిహిత్యమే ఉండేది. నా జీవితంలో వచ్చిన ప్రతి ఒక్కరిని ముక్తకంఠంతో అంగీకరించాను. ప్రతి ఒక్కరికీ సమానమైన ప్రేమ, గౌరవాన్ని ఇచ్చాను. నిజానికి నేను సుమారు మూడు సార్లు వివాహ బంధానికి అతి దగ్గరగా వెళ్లాను. అయితే అదృష్టవశాత్తూ ఆ దేవుడు నన్ను రక్షించాడు. వారి జీవితంలో జరిగిన విషయాలను నేను మీతో పంచుకోలేను. కానీ దేవుడు నన్ను, నా పిల్లలను కాపాడుతున్నాడు. నేను గజిబిజి బంధంలో చిక్కుకు పోవాలని దేవుడు కోరుకోవడం లేదు’ అని చెప్పుకొచ్చింది సుస్మిత.

కాగా మొన్నటివరకు మోడల్ రోహ్మన్ షాల్ తో ప్రేమలో ఉంది సుస్మితాసేన్. అయితే అనూహ్యంగా అతనితో తన బంధం ముగిసిందని సోషల్ మీడియా వేదికగా ఆమె ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..