Sunny Leone: అతిథుల చదివింపులతోనే రిసెప్షన్‌ బిల్లులు చెల్లించాం.. పెళ్లినాటి  పరిస్థితులను గుర్తు చేసుకున్న అందాల తార..

| Edited By: Anil kumar poka

Apr 10, 2022 | 8:27 AM

Sunny Leone: హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌తో మొదటిసారి భారతీయులకు పరిచయమైంది సన్నీ లియోన్‌. ఆతర్వాత బాలీవుడ్‌ లో అడుగుపెట్టి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Sunny Leone: అతిథుల చదివింపులతోనే రిసెప్షన్‌ బిల్లులు చెల్లించాం.. పెళ్లినాటి  పరిస్థితులను గుర్తు చేసుకున్న అందాల తార..
Sunny Leone
Follow us on

Sunny Leone: హిందీ బిగ్‌బాస్‌ సీజన్‌తో మొదటిసారి భారతీయులకు పరిచయమైంది సన్నీ లియోన్‌. ఆతర్వాత బాలీవుడ్‌ లో అడుగుపెట్టి అనతికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కేవలం హిందీకే పరిమితమవ్వకుండా కరెంట్‌ తీగ లాంటి తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాలోనూ సన్నీ నటిస్తోంది. సినిమాల సంగతి పక్కన పెడితే తన సేవా కార్యక్రమాలతోనూ ఫ్యాన్స్ లో పాపులారిటీ తెచ్చుకుంది. ఓ అనాథ ఆడపిల్లను దత్తత తీసుకుని తన పెద్ద మనసును చాటుకుంది. ఇక ఆమె వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. 2011లో అమెరికాకు చెందిన నటుడు, పారిశ్రామికవేత్త డేనియల్ వెబర్‌ను వివాహం చేసుకుంది సన్నీ. ఆ తర్వాత సరోగసీ విధానంలో ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా సినిమాలతో పాటు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ అందాల తార తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో తన పెళ్లినాటి ఫొటోను షేర్‌ చేసింది.

ఇది 11 ఏళ్ల కిందటి నా పెళ్లి ఫొటో..ఆ సమయంలో మా చేతిలో డబ్బుల్లేవు. అందుకే వివాహ వేడుకకు కూడా కేవలం 50 మందిని మాత్రమే ఆహ్వానించాం. పెళ్లిలో పెద్దగా అలంకరణలు కూడా లేవు. పెళ్లికొచ్చిన చాలామంది నానామాటలన్నారు. ఇక అతిథులు అందజేసిన వెడ్డింగ్ ఎన్వెలప్స్, గిఫ్ట్‌ కవర్స్‌ను కూడా వెంటనే తెరిచేశాం. అందులో వచ్చిన డబ్బులతోనే రిసెప్షన్‌ బిల్లులు చెల్లించాం. ఈ ప్రయాణాన్ని తలచుకుంటే మేం చాలా దూరం ప్రయాణించామని అర్థమవుతోంది. నా భర్త అందించిన ప్రేమాభిమానాలు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. హ్యాపీ యానివర్సరీ బేబీ’ అంటూ అప్పటి గడ్డు పరిస్థితులను గుర్తు తెచ్చుకుంది సన్నీ. ఇక సినిమాల విషయానికొస్తే.. తెలుగులో మంచు విష్ణు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో సన్నీ సందడి చేయనుంది.

Also Read: Railway Recruitment 2022: నెలకు 25 వేలకు పైగా జీతం.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. పూర్తి వివరాలివే..
Indian Currency: భారతీయ కరెన్సీ నోట్లపై ఎన్ని భాషల్లో సమాచారం ఉంటుందో తెలుసా..!

TRS Hoardings: ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా టీఆర్ఎస్ హోర్డింగులు.. 11 నాటి ధర్నాకు భారీ ఏర్పాట్లు