బాలీవుడ్ సీనియర్ హీరో అనిల్ కపూర్ తనయగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది నటి సోనమ్ కపూర్(Sonam Kapoor). తనదైన అందం, అభినయంతో అతని కాలంలోనే క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. సినిమా కెరీర్ పీక్స్‌లో ఉండగానే వ్యాపారవేత్త ఆనంద్ అహూజా (Anand Ahuja)ని వివాహం చేసుకుంది. తమ వైవాహిక బంధానికి గుర్తింపుగా గతేడాది గర్భం దాల్చింది. ఈ ఏడాది ఆగస్టు 20న ఓ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చింది. కాగా కొన్ని రోజుల క్రితం ప్రముఖ సెలబ్రిటీ మ్యాగజైన్ వోగ్ ముఖచిత్రంపై కనిపించింది సోనమ్. ఈ సందర్భంగా తన బిడ్డ భవిష్యత్ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.
‘నేను, నా సోదరి రియా, సోదరుడు హర్షవర్ధన్‌ని.. మా తల్లిదండ్రులు అనిల్ కపూర్, సునీతా కపూర్ చాలా గోప్యంగా పెంచారు. సెలబ్రిటీల లైఫ్‌కు దూరంగా జనాల దృష్టిలో పడకుండా చేశారు. అలా ఎలా ఉంచగలిగారో నాకు తెలియదు. ఎంతలా అంటే.. నేను స్టార్ పిల్లలు లేని ఆర్య విద్యామందిర్ చదివాను.ఆ తర్వాత జూనియర్ కాలేజ్ కోసం బోర్డింగ్ స్కూల్‌కి వెళ్లాను. అక్కడ ఇంకా చాలా నేర్చుకున్నాను. నా పిల్లలకు కూడా అలాంటి లైఫ్ ఇద్దామనుకుంటున్నాను. నిజం చెప్పాలంటే.. నా కుమారుడిని ఇండియాలో చదివించాలా? లేక లండన్‌లో చదివించాలా? అన్న విషయంపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. భారత్‌లో ఉంటే నా సొంత ఇంట్లో ఉన్నట్లు ఫీల్ అవుతాను. కానీ మాకు ఇక్కడ ఓ సమస్య ఉంది. నేను నా బిడ్డను ఇక్కడ పెంచితే గోప్యత కష్టమవుతుంది. అదే సమయంలో చాలామంది స్టార్ కిడ్స్ ఇక్కడ సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. అది చూసిన తర్వాత కొన్ని అడ్డంకులను చాలా సులువుగా దాటగలమని అనిపించింది’ అని చెప్పుకొచ్చింది సోనమ్.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..