
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్‌కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. కేవలం నార్త్‌లోనూ సౌత్‌లో… విదేశాల్లో కోట్లాది మంది అభిమానులున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. బీటౌన్‌లో సూపర్ స్టార్‌గా స్పెషల్ ఇమేజ్ సంపాదించుకున్నారు. అందుకే షారుఖ్‌ను ఫ్యాన్స్ అంతా ముద్దుగా బాద్ షా అని పిలుచుకుంటారు. చాలా కాలంగా వరుస ప్లాపులతో నెట్టుకొస్తున్న షారుఖ్.. ప్రస్తుతం పఠాన్ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. జీరో సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్లు వెండితెరపై కనిపించని ఈ హీరో… ఇప్పుడు పఠాన్ సినిమాతో ప్రభంజనం సృష్టించాడు. దీపికా పదుకొణె కథానాయికగా నటించిన ఈ సినిమా విడుదలైన వారం రోజుల్లోనే దాదాపు 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డ్ బద్దలుకొట్టింది. దీంతో బాద్ షా ఈజ్ బ్యాక్ అంటూ నెట్టింట సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
ఇదిలా ఉంటే.. ఇటు వెండితెరపైనే కాదు.. సోషల్ మీడియాలో షారుఖ్ చాలా యాక్టివ్. ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్స్.. వ్యక్తిగత ఫోటోస్ షేర్ చేయడమే కాదు.. ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు తన స్టైల్లో ఆన్సర్ ఇస్తుంటారు. అయితే ప్రస్తుతం షారుఖ్ ఇన్ స్టాలో దాదాపు 36 మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో చాలా మంది షారుఖ్ ఖాన్ కు హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనే చెప్పుకోవాలి. అయితే ఇన్ని మిలియన్స్ మంది ఫాలోవర్స్ ఉన్న షారుఖ్ మాత్రం కేవలం ఆరుగురినే ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఆ ఆరుగురు ఎవరో తెలుసుకుందామా.
షారుఖ్ ఫాలో అవుతున్న ఆరుగురిలో మొదటి వ్యక్తి ఆయన భార్య గౌరీ ఖాన్. ఇక రెండో వ్యక్తి ఆయన తనయుడు ఆర్యన్ ఖాన్. అలాగే మూడో వ్యక్తి షారుఖ్ గారాల పట్టి సుహానా ఖాన్. అలాగే నాలుగో వ్యక్తి ఆలియా చిబా.. ఆమె షారుఖ్ బావమరిది కూతురు. అంటే బాద్ షా సతీమణి గౌరీ ఖాన్ సోదరుడి కూతురు అన్నమాట. ఇక ఆయన ఫాలో అవుతున్న ఐదవ వ్యక్తి.. షారుఖ్ పర్సనల్ మేనేజర్ పూజా దద్లాని. ఆమె షారుఖ్ వద్ద 2012 నుంచి మేనేజర్ గా పనిచేస్తోంది. గౌరీ ఖాన్ తో పూజకు మంచి అనుబంధం ఉంది. ఇక బాద్ షా ఫాలో అవుతున్న ఆరవ వ్యక్తి కాజల్ ఆనంద్. ఈమె షారుఖ్ కు బెస్ట్ ఫ్రెండ్. లా చదువుకున్న కాజల్ ఆనంద్ గతంలో సంజయ్ దత్ లీగల్ టీంలోనూ పనిచేశారు. ప్రస్తుతం ఆమె లా కాకుండా.. లైఫ్ స్టైల్ అండ్ ఫ్యాషన్ బిజినెస్ లో రాణిస్తున్నారు. షారుఖ్.. తన కుటుంబానికి.. ఆత్మీయులకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారనేది తన ఇన్ స్టా చూస్తే అర్థమవుతుంది కదూ.. ప్రస్తుతం బాద్ షా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ చిత్రంలో నటిస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.