బాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు దర్యాప్తు మళ్లీ స్పీడందుకుంది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడు అర్మాన్ కోహ్లీ మరోసారి చిక్కుల్లో ఇరుక్కున్నారు. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్ కేసులో అర్మాన్ ఇంటిపై దాడి చేసింది. ఆనంతరం అతడిని అదుపులోకి తీసుకుంది. గత కొన్ని రోజులుగా ముంబైలో డ్రగ్స్ గురించి NCBకి సమాచారం అందుతోంది. ఆ తర్వాత NCB ఆపరేషన్ ప్రారంభించి దానికి “రోలింగ్ థండర్” అని పేరు పెట్టింది. ‘రోలింగ్ థండర్’ ఆపరేషన్ కింద అర్మాన్ కోహ్లీ ఇంటిపై దాడి చేశారు. అర్మాన్ ఇంట్లో డ్రగ్స్ దొరకడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ కేసులో మరో బాలీవుడ్ నటుడు అరెస్టయ్యాడు. ఆదివారం ఉదయం నటుడు అర్మాన్ కోహ్లిని ప్రశ్నించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB).. అతని ఇంట్లో నిషేధిత డ్రగ్స్ లభించడంతో అరెస్ట్ చేసింది. అర్మాన్ ఇంటి నుంచి చిన్న మొత్తంలో కొకైన్ లభించినట్లు ఎన్సీబీ ముంబై జోనల్ యూనిట్ డైరెక్టర్ సమీర్ వాంఖెడె వెల్లడించారు. ఈ కొకైన్ దక్షిణ అమెరికా ఖండం నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఈ కొకైన్ విదేశాల నుంచి ఇండియాకు ఎలా వచ్చిందన్నదానిపై ఇప్పుడు ఎన్సీబీ విచారణ జరుపుతోంది.
శనివారం అజయ్ రాజు సింగ్ అనే డ్రగ్ స్మగ్లర్‌ను ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. అతను ఇచ్చిన సమాచారం మేరకే ఆదివారం ఉదయం అర్మాన్ కోహ్లి ఇంట్లో దాడులు చేశారు. కొకైన్ లభించడంతో అతన్ని విచారణ కోసం తమ ఆఫీస్‌కు తీసెకెళ్లారు. బిగ్ బాస్ షోతోపాటు బాలీవుడ్ మూవీ ప్రేమ్ రతన్ ధన్ పాయోలాంటి బాలీవుడ్ మూవీస్‌లో అర్మాన్ నటించాడు.
ఇవి కూడా చదవండి: Uttarakhand landslide: ఉత్తరాఖండ్‌ను ముంచెత్తుతున్న వరదలు.. కొనసాగుతున్న ప్రకృతి బీభత్సం..రంగంలోకి NDRF బృందాలు..