Ram Charan: రామ్ చరణ్ ప్రశంసకు ఉబ్బితబ్బిబ్బవుతున్న బాలీవుడ్ ఫీమేల్ సింగర్.. నెట్టింట వైరలవుతున్న వీడియో..

|

Dec 14, 2022 | 1:10 PM

ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఆర్సీ 15 సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న చెర్రీ.. ఇటీవల బాలీవుడ్ లో ఓ స్పెషల్ ప్రోగ్రామ్‏కు అటెండ్ అయ్యారు. అక్కడ ఫేమస్ సింగర్ నేహా కక్కర్‍ను కలిసిన ఆయన..

Ram Charan: రామ్ చరణ్ ప్రశంసకు ఉబ్బితబ్బిబ్బవుతున్న బాలీవుడ్ ఫీమేల్ సింగర్.. నెట్టింట వైరలవుతున్న వీడియో..
Ram Charan
Follow us on

ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‏కు ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. జక్కన్న తెరకెక్కించిన ట్రిపుల్ ఆర్ మూవీతో చరణ్ క్రేజ్ ఒక్కసారిగా మారింది. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో చెర్రీ నటనకు నార్త్ ఆడియన్స్ మాత్రమే కాదు.. విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ రూపొందిస్తున్న ఆర్సీ 15 సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న చెర్రీ.. ఇటీవల బాలీవుడ్ లో ఓ స్పెషల్ ప్రోగ్రామ్‏కు అటెండ్ అయ్యారు. అక్కడ ఫేమస్ సింగర్ నేహా కక్కర్‍ను కలిసిన ఆయన.. ఆమెకు పెద్ద అభిమానని అంటూ పలకరించారు. చరణ్ కామెంట్‍తో నేహా తెగ సంతోషపడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ తన ఆనందాన్ని తెలియజేసింది.
చరణ్ తనను చూడగానే.. నేను మీకు పెద్ద అభిమానిని అంటూ విష్ చేశారని.. అది తనకు బిగ్ కాంప్లిమెంట్ అని.. తాను కూడా చెర్రీకి వీరాభిమానని అని.. ఈ క్షణాలు ఎంతో అద్భుతమంటూ చరణ్ ను కలిసిన వీడియో షేర్ చేసింది నేహా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఆ వీడియోలో అందరితోపాటు నవ్వుతూ సరదాగా కూర్చున్న చరణ్.. నేహా కక్కర్ రాగానే చిరునవ్వుతూ లేచి .. రెండు చేతులతో నమస్కరిస్తూ ఆప్యాయంగా పలికరించారు. అనంతరం ఆమెకు పెద్ద ఫ్యాన్ అని చెర్రీ చెప్పగా.. తను కూడా చరణ్ కు పెద్ద అభిమానిని అని చెప్పడం చూడొచ్చు. నేహా షేర్ చేసిన వీడియోపై ఆమె భర్త రోహన్ రియాక్ట్ అయ్యారు. ట్రూలీ.. ఇన్ ఎ బిలియన్ మై నేహూ అంటూ రెడ్ హార్ట్ ఎమోజీని షేర్ చేశారు. ఇటీవలే నేహా.. క్యూటీ క్యూటీ పాటను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో నేహా లుక్స్ పై దారుణంగా ట్రోలింగ్ జరిగింది.

ఇవి కూడా చదవండి

ఇక మరోవైపు చరణ్.. ఆర్సీ సినిమా అనంతరం… ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలోనూ ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.