Sonu Sood: సోనూ భాయ్ పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నాడా? ఆ పార్టీలో చేరాలని నిర్ణయించాడా?
Sonu Sood Political Entry: సోనూ సూద్.. కరోనా లాక్‌డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా మార్మోగిపోయిన పేరు. అడిగిన వారికి లేదనకుండా.. కాదనకుండా సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు.
Sonu Sood Political Entry: సోనూ సూద్.. కరోనా లాక్‌డౌన్ సమయంలో దేశ వ్యాప్తంగా మార్మోగిపోయిన పేరు. అడిగిన వారికి లేదనకుండా.. కాదనకుండా సాయం చేస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ దేశ వ్యాప్తంగా మంచి ఇమేజ్ సాధించాడు. అభినవ కర్ణుడిగా మెప్పుపొందిన ఈ బాలీవుడ్ నటుడికి ఇప్పుడు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. బాలీవుడ్ నటుడిగా వచ్చిన గుర్తింపు కంటే.. సేవా కార్యక్రమాలతోనే సోనూ భాయ్ ఎక్కువ గుర్తింపు సాధించాడు. రాజకీయాల్లోకి వచ్చేందుకే సోనూసూద్ ఇదంతా చేస్తున్నాడని కొందరు పొలిటీషియన్స్ మొదట్లోనే వ్యాఖ్యలు చేశారు. అయితే రాజకీయాలపై ఆసక్తి లేదంటూ సోనూ చెబుతూ వచ్చాడు. ఇప్పుడు వారు చెప్పిందే నిజం కాబోతుందా? సోనూ పొలిటికల్ ఎంట్రీకి డిసైడ్ అయ్యాడా? ఏ పార్టీలో చేరాలనే విషయంలోనూ సోనూకు క్లారిటీ వచ్చేసిందా? దేశ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్.
అటు జాతీయ మీడియాలోనూ సోనూ సూద్ పొలికిల్ ఎంట్రీ దాదాపు ఖాయమైపోయినట్లు చర్చ జరుగుతోంది. ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌తో శుక్రవారం(ఆగస్టు 27)నాడు ఢిల్లీలో సోనూ సూద్ భేటీకానుండటమే ఈ చర్చకు కారణం. 2022లో పంజాబ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలపై ఆప్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో పార్టీ జెండా పాతాలని కేజ్రీవాల్ పట్టుదలగా ఉన్నారు. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌తో సోనూ సూద్ భేటీకానుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపైనే సోనూ సూద్‌తో కేజ్రీవాల్ చర్చలు జరిపే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.
సోనూ సూద్ లేదా ఆయన సోదరి(మాల్విక సచ్చర్) పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు ఇది వరకే ఊహాగానాలు వినిపించాయి. మాల్విక సచ్చర్ కాంగ్రెస్ టిక్కెట్‌పై మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశముందని పుకార్లు వినిపించాయి. సామాజిక సేవా కార్యక్రమాలతో ఆమె మోగా నియోజకవర్గ పరిధిలో మంచి గుర్తింపు సాధించారు. ఈ నేపథ్యంలో సోనూ సూద్ ఢిల్లీలో కేజ్రీవాల్‌తో భేటీ కానుండటం పొలిటికల్‌ను పెంచింది. సోనూ సూద్ ఆప్‌లో చేరడం ఖాయమని జాతీయ మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరికొన్ని గంటల వ్యవధిలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
పంజాబ్ ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ రకంగానూ పంజాబ్ ప్రజలకు సోనూ భాయ్ చాలా దగ్గరయ్యారు.
Also Read..
Ginger Farmers: కిలో అల్లం రూ.20నే.. చేసేదేం లేక పొలాల్లోనే పంటను దున్నేస్తున్న రైతులు