Alia Bhatt: అక్కడుంది అలియా భట్ గురూ..! చూడటానికి సింపుల్‌గానే ఉంది కానీ కాస్ట్ చూస్తే కళ్లు తిరగాల్సిందే..

|

May 13, 2024 | 11:05 AM

హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా బట్టలకు లక్షలు కుమ్మరిస్తుంటారు. ఎక్కువ బాలీవుడ్ బ్యూటీలు ఇలా డ్రస్సుల కోసం, చెప్పుల కోసం లక్షలు ఖర్చు చేస్తుంటారు. తాజాగా అందాల భామ అలియా భట్ కూడా ఫ్యాషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. మోడ్రన్ డ్రస్సుల్లో మెరుస్తూనే అప్పుడప్పుడు చీరకట్టులోనూ కవ్విస్తుంది. తాజాగా ఈ అమ్మడు అలియా భట్ ఆదివారం అర్థరాత్రి ముంబై  ఎయిర్ పోర్ట్ లో తళుక్కుమంది.

Alia Bhatt: అక్కడుంది అలియా భట్ గురూ..! చూడటానికి సింపుల్‌గానే ఉంది కానీ కాస్ట్ చూస్తే కళ్లు తిరగాల్సిందే..
Aliya Bhat
Follow us on

సెలబ్రిటీలు వాడే వస్తువులు చాలా కాస్ట్ ఉంటాయి. చిన్న చిన్న వస్తువులుకూడా భారీ ధర ఉంటాయి. బ్రాండెడ్ వస్తువులు వాడుతుంటారు. వాచ్ లు, షూస్, జాకెట్స్ ఇలా అన్ని బ్రాండెడ్‌వే వాడుతుంటారు. హీరోలు మాత్రమే కాదు హీరోయిన్స్ కూడా బట్టలకు లక్షలు కుమ్మరిస్తుంటారు. ఎక్కువ బాలీవుడ్ బ్యూటీలు ఇలా డ్రస్సుల కోసం, చెప్పుల కోసం లక్షలు ఖర్చు చేస్తుంటారు. తాజాగా అందాల భామ అలియా భట్ కూడా ఫ్యాషన్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. మోడ్రన్ డ్రస్సుల్లో మెరుస్తూనే అప్పుడప్పుడు చీరకట్టులోనూ కవ్విస్తుంది. తాజాగా ఈ అమ్మడు అలియా భట్ ఆదివారం అర్థరాత్రి ముంబై  ఎయిర్ పోర్ట్ లో తళుక్కుమంది. అలియా భట్ ను చూసిన ఫొటోగ్రాఫర్లు ఆమెను తెగ ఫోటోలు తీశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ముంబై ఎయిర్ పోర్ట్ లో క్యాజువల్ లుక్ లో కనిపించింది అలియా భట్. మెగా గూచీ ఈవెంట్ కోసం లండన్‌కు వెళ్లడానికి ముంబై ఎయిర్ పోర్ట్ కు వెళ్ళింది అలియా. అయితే ఆమె ధరించిన దుస్తుల విలువ కొన్ని లక్షలు ఉంటుందని తెలుస్తోంది. అలియా గూచీ లేబుల్‌ దుస్తులను ధరించింది.  ఆమె లగ్జరీ బ్రాండ్ షెల్ఫ్‌ స్పోర్టీ జెర్సీ టీ-షర్టును ధరించి కనిపించింది. దాని ధర రూ. 49,268 ఉంటుంది.

అలాగే ఆమె ధరించిన ప్యాంట్ రూ. 1,25,258 ధరఉంటుంది. అలాగే రూ. 47,180 విలువైన గూచీ సన్ గ్లాసెస్‌తో అదరగొట్టింది. అలియా రూ. 2,48,847 విలువైన గూచీ హార్స్‌బిట్ 1955 మినీ క్రాస్‌బాడీ బ్యాగ్‌ని ధరించింది. ఆమె సూట్‌కేస్, డఫిల్ బ్యాగ్ కూడా లగ్జరీ బ్రాండ్‌కు చెందినవి, గూచీ సావర్ క్యాబిన్ ట్రాలీ ధర రూ. 2,88,095, డఫిల్ బ్యాగ్ ధర రూ. 2,04,589. మొత్తంగా అలియా భట్ ఎయిర్‌పోర్ట్ లుక్ రూ. 9.63 లక్షలు.

అలియా భట్ ఇన్ స్టా గ్రామ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.