Akshay Kumar: ‘నేను భారతీయుడిని.. అదే నమ్ముతా’.. మతంపై స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఏమన్నారో తెలుసా?

బాలీవుడ్‌లో విపరీతమైన డిమాండ్ ఉన్న హీరో అక్షయ్ కుమార్ . ఇటీవ‌ల ఆయ‌న నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఇటీవలే విడుదలైన 'ఓఎంజీ 2' చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఆ సినిమాలో అక్షయ్ కుమార్‌ది ప్రధాన పాత్ర కాదు. దీంతో ఆయన చేయబోయే సినిమాలు పెద్ద విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

Akshay Kumar: నేను భారతీయుడిని.. అదే నమ్ముతా.. మతంపై స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఏమన్నారో తెలుసా?
Akshay Kumar

Updated on: Sep 09, 2023 | 10:14 PM

బాలీవుడ్‌లో విపరీతమైన డిమాండ్ ఉన్న హీరో అక్షయ్ కుమార్ . ఇటీవ‌ల ఆయ‌న నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఇటీవలే విడుదలైన ‘ఓఎంజీ 2’ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. అయితే ఆ సినిమాలో అక్షయ్ కుమార్‌ది ప్రధాన పాత్ర కాదు. దీంతో ఆయన చేయబోయే సినిమాలు పెద్ద విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఇదిలా ఉంటే అక్షయ్ కుమార్ శనివారం (సెప్టెంబర్ 9) తన పుట్టినరోజును జరుపుకొంటున్నారు . సోషల్ మీడియాలో అందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే మతం గురించి ఆయన చెప్పిన మాటలకు సంబంధించిన కొన్ని వీడియోలను ఫ్యాన్స్‌, నెటిజన్లు ట్రెండ్‌ చేస్తున్నారు. 2021లో అక్షయ్ కుమార్ నటించిన ‘సూర్యవంశీ’ చిత్రం విడుదలైంది. ఆ సినిమా ప్రమోషన్‌లో కొందరు మతం గురించి అక్షయ్‌ను అడిగారు. ఈ సినిమా ఏదైనా ప్రత్యేక మతంపై వివక్ష చూపుతుందా అని ప్రశ్నించారు. దానికి సమాధానమిచ్చిన అక్షయ్ కుమార్ తన స్టాండ్‌ను స్పష్టం చేశాడు. ‘‘నేను ఏ మతాన్ని నమ్మను. కించపరచను. నేను భారతీయుడిని అని మాత్రమే నమ్ముతాను. అదే సినిమాలో చూపిస్తాం. మతం ఆధారంగా మనం ఏదీ చూడలేదు. ఈ సినిమాలో భారతీయుడు అనే కాన్సెప్ట్‌ ఉందని, హిందూ, ముస్లిం, పార్సీ కాదని అక్షయ్‌ కుమార్‌ అన్నారు. సినిమాలో ఏ మతానికి చెందిన వ్యక్తినైనా విలన్‌గా చూపించడం చేతనైన నిర్ణయం కాదన్నారు. నెగెటివ్, పాజిటివ్ క్యారెక్టర్స్‌తో సినిమా చేస్తాం. నేను ఒక పాత్ర మాత్రమే చేస్తున్నాను. ప్రతి సినిమాలో మంచి, చెడు పాత్రలు ఉంటాయి. ప్రేక్షకులకు తమ జీవితాల్లో ఏమి స్వీకరించాలనే జ్ఞానం ఉంది’ అని అక్షయ్ కుమార్ అన్నారు.

చేతిలో అరడజనకు పైగా సినిమాలు..

కాగా గతంలో అక్షయ్‌ కెనడియన్ పౌరసత్వం కలిగి ఉన్నాడు. అయితే ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆయనకు భారత పౌరసత్వం లభించింది. ప్రస్తుతం చాలా సినిమాల్లో బిజీగా ఉంటున్నాడు అక్షయ్‌ కుమార్‌. త్వరలోనే మిషన్‌ రాణిగంజ్‌ సినిమాతో మన ముందుకు వస్తున్నాడీ స్టార్‌ హీరో. దీంతో పాటు ఆకాశం నీ హద్దురా రీమేక్‌లోనూ నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలతో పాటు బడే మియా, ఛోటే మియా, హీరా ఫెరీ3. స్కై ఫోర్స్‌, శంకర తదితర ప్రాజెక్టులు అక్షయ్‌ కుమార్‌ చేతిలో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అక్షయ్ కుమార్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..