TOP9 ET New: చరిత్ర సృష్టించిన మహేష్‌.. | వావ్‌.. G20 లో.. రామ్ చరణ్ డ్యాన్స్‌.!

TOP9 ET New: చరిత్ర సృష్టించిన మహేష్‌.. | వావ్‌.. G20 లో.. రామ్ చరణ్ డ్యాన్స్‌.!

Anil kumar poka

|

Updated on: Sep 10, 2023 | 12:53 PM

మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌.. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌ ప్రోమోలో తళుక్కున మెరిశారు. వివిధ నగరాల్లో జరిగిన జీ20 సమావేశాలు ప్రోమోగా చేసి.. జీ20 శిఖరాగ్ర సదుస్సులో స్క్రీన్‌ చేశారు. ఇందులో రామ్ చరణ్ శ్రీనగర్‌ సదస్సులో .. కొరియన్ అంబాసిడర్తో చేసిన నాటు నాటు స్టెప్పులు కూడా ఉండడం..మెగా ఫ్యాన్స్‌ ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. చెర్రీ జీ20 వీడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

01.Mahesh
సూపర్ స్టార్ మహేష్ హిస్టరీ క్రియేట్ చేశారు. కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కి..2015లో రిలీజ్‌ అయిన శ్రీమంతుడు సినిమా.. తాజాగా యూట్యూబ్‌లో 200 మిలియన్ వ్యూస్ ను వచ్చేలా చేసుకుంది. దీంతో యూట్యూబ్లో 200 మిలియన్ వ్యూస్ అందుకున్న తొలి తెలుగు సినిమాగా రికార్డుల కెక్కింది ఈ సినిమా.

02.G20 Ram Charan
మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌.. ఢిల్లీలో జరుగుతున్న జీ20 సమ్మిట్‌ ప్రోమోలో తళుక్కున మెరిశారు. వివిధ నగరాల్లో జరిగిన జీ20 సమావేశాలు ప్రోమోగా చేసి.. జీ20 శిఖరాగ్ర సదుస్సులో స్క్రీన్‌ చేశారు. ఇందులో రామ్ చరణ్ శ్రీనగర్‌ సదస్సులో .. కొరియన్ అంబాసిడర్తో చేసిన నాటు నాటు స్టెప్పులు కూడా ఉండడం..మెగా ఫ్యాన్స్‌ ను ఖుషీ అయ్యేలా చేస్తోంది. చెర్రీ జీ20 వీడియో క్లిప్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

03.Jawan Collections
షారుఖ్ జవాన్ సినిమా బాక్సాఫీస్ బద్దుల కొడుతోంది. రిలీజ్ అయిన 1స్ట్ డే వరల్డ్ వైడ్ దాదాపు 120 క్రోర్ గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. డే 2 కూడా 100కోట్లను కమాయించింది. ఇక ఓవర్‌ ఆల్‌గా రెండు రోజులకు కలిసి 234.29 కోట్లను వసూలు చేసింది షారుఖ్ జవాన్ మూవీ.

04. Megastar
రామ్‌చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి కీ రోల్‌ చేస్తారనే ప్రచారం తాజాగా జోరందుకుంది. ఇక స్పోర్స్ట్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కే ఈ మూవీలో రామ్‌చరణ్‌కి గురువుగా కనిపిస్తారట చిరంజీవి.

05.Balagam
ఇంటర్నేషనల్ వేదికలపై ఇప్పటికే ఎన్నో అవార్డులు అందుకున్న బలగం మూవీ.. తాజాగా మరో ఇంటర్నేషనల్ అవార్డ్స్‌లో బజ్ చేసింది. క్రొయేషియాలో జరిగే అంతర్జాతీయ సౌండ్ అండ్ ఫిల్మ్ మ్యూజిక్ ఫెస్టివల్లో.. బెస్ట్ ఒరిజినల్ స్కోర్ ఫీచర్ కేటగిరీలో ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్‌కు పేరు నామినేషన్‌ అయింది. ఇక ఇదే విషయాన్ని తాజాగా ఈ మూవీ టీం ఎక్స్ లో షేర్ చేసింది.

06. Hari hara veeramallu
ఇప్పటికే ఓజీ , ఉస్తాద్ మూవీ షూట్స్ తో బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్.. తన మోస్ట్ అవేటెడ్ పీరియాడికల్ ఫిల్మ్ హరి హర వీరమల్లు సినిమా షూట్‌ను స్టార్ట్ చేయనున్నారట. నవంబర్ రెండో వారంలో.. లేదా మూవీ వారంలో .. ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనున్నారట పవర్‌ స్టార్.

07.Venky kudumula
నితిన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్న వెంకీ కుడుముల తాజాగా షాకింగ్ ట్వీట్ చేశారు. నితిన్ సినిమా అప్డేట్ ఎప్పుడంటూ.. తన బర్త్ డే రోజు అడిగిన ఓ ఫ్యాన్స్‌పై అసహనం వ్యక్తం చేశారు. బర్త్‌ డే రోజు .. ప్రశాంతంగా ఉందామనుకున్నా.. అప్డేట్స్ అని ఒత్తిడి చేయొద్దంటూ..ఆ ట్వీట్కు రిప్లై ఇచ్చారు ఈస్టార్ డైరెక్టర్ .

08.Release Date
ప్రభాస్‌ సలార్ రిలీజ్ డేట్ సెప్టెంబర్ 28 నుంచి పోస్ట్ పోన్ అవడంతో.. ఈ డేట్ పై ఫోకస్ చేసే మేకర్స్ రోజు రోజుకూ పెరిగిపోతున్నారు. ఇప్పటికే రాపో స్కంద, కిరణ్ అబ్బవరం రూల్స్ రంజన్ సెప్టెంబర్ 28కే తమ సినిమా రిలీజ్ అంటూ అనౌన్స్ చేయగా.. తాజాగా చంద్రముఖి సినిమాకు సీక్వెల్‌ గా వస్తున్న చంద్రముఖి 2 కూడా ఇదే డేట్ రిలీజ్ కు రెడీ అవుతోంది.

09.Mahesh
ఇక జవాన్ సినిమా బాగుందంటూ.. బ్లాక్ బస్టర్ హిట్టంటూ.. ట్వీట్ చేసిన మహేష్‌కు.. తాజాగా రిప్లై ఇచ్చారు కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్. ఈ మూవీ నీకు నచ్చడంతో.. అందరూ థ్రిల్ ఫీలవుతున్నారని.. థ్యాంక్స్ మహేష్ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. అంతేకాదు అందర్నీ ఎంటర్‌ టైన్ చేయడం కోసం మరింతగా కష్టపడి పని చేస్తా అంటూ.. కూడా తన ట్వీట్లో కోట్ చేశారు షారుఖ్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Sep 10, 2023 09:55 AM