Bell Bottom : అక్షయ్ కుమార్ సినిమాకు ఊహించని రిజల్ట్.. ఆలోచనలో పడ్డ బాలీవుడ్ బడా సినిమాలు..

బాలీవుడ్ మూవీ బెల్‌ బాటమ్ రిలీజ్ కోసం ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలు ఆసక్తిగా ఎదురుచూశాయి. కోవిడ్‌ తరువాత థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా రిజల్ట్ మీద బాలీవుడ్..

Bell Bottom : అక్షయ్ కుమార్ సినిమాకు ఊహించని రిజల్ట్.. ఆలోచనలో పడ్డ బాలీవుడ్ బడా సినిమాలు..
Akshay

Edited By: Anil kumar poka

Updated on: Aug 26, 2021 | 9:42 AM

Bell Bottom : బాలీవుడ్ మూవీ బెల్‌ బాటమ్ రిలీజ్ కోసం ఇండియాలోని అన్ని ఇండస్ట్రీలు ఆసక్తిగా ఎదురుచూశాయి. కోవిడ్‌ తరువాత థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా రిజల్ట్ మీద బాలీవుడ్ సినిమాలతో పాటు పాన్‌ ఇండియా ప్రాజెక్ట్స్ భవిష్యత్తు కూడా డిపెండ్ అయి ఉంటుందన్నది ఇండస్ట్రీ జనాల నమ్మకం. చాలా రాష్ట్రాల్లో 50 పర్సెంట్ ఆక్యుపెన్సీకి మాత్రమే పర్మిషన్‌…. మహారాష్ట్రలో అయితే అసలు థియేటర్లే లేవు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూడా 1600 థియేటర్లలో రిలీజ్ అయ్యింది బెల్ బాటమ్‌. తొలి రోజు ఏకంగా 5000 షోస్‌ పడ్డాయి. మరీ ఈ రేంజ్‌లో షోస్‌ పడితే కలెక్షన్లు కూడా ఆ స్థాయిలోనే ఉండాలిగా…? కానీ అంత సీన్‌ అయితే కనిపించలేదు.

భారీ ప్రమోషన్‌ చేసినా.. ఆన్‌లైన్‌ బుకింగ్స్‌లో ఫ్రీ టికెట్స్ ఆఫర్ పెట్టినా.. ఆడియన్స్‌ మాత్రం థియేటర్లకు రాలేదు. అందుకే ఇంత భారీగా రిలీజ్ అయిన బెల్‌ బాటమ్ సినిమాకు డే వన్‌ కలెక్షన్స్‌ చాలా పూర్‌గా ఉన్నాయి. జస్ట్ 3 కోట్లతోనే సరిపెట్టుకున్నారు ఖిలాడీ స్టార్ అక్షయ్‌. ఇక బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ సినిమా అంటే వంద కోట్ల వసూళ్లు ఖాయం అన్నట్లుగా గత కొన్ని సంవత్సరాలుగా పరిస్థితి కొనసాగుతుంది. అలాంటి అక్షయ్ కుమార్ మూవీ కనీసం పది కోట్లు కూడా వసూళ్లు చేయలేక పోయింది ఇప్పుడు. ఈ పరిస్థితి ప్రస్తుతం దేశంలో ఉన్న థియేటర్ల పరిస్థితికి అద్దం పడుతుంది అనడంలో సందేహం లేదు. ఈ రిజల్ట్ తో బాలీవుడ్ లో థియేట్రికల్‌ రిలీజెస్ మీద మరోసారి డైలమా ఏర్పడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే బాలీవుడ్ లో పెద్ద సినిమాలు విడుదల అవ్వడానికి మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Seeti Maar: థియేటర్లలో సీటీ కొట్టే సమయం వచ్చేసింది.. గోపీచంద్‌ కొత్త చిత్రం విడుదల ఎప్పుడంటే.

తనపై వస్తున్న ఫేక్ న్యూస్ లపై స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మంచు వారి అబ్బాయి..:Manchu Manoj Video.

Sridevi Soda Center: సెన్సార్ పూర్తి చేసుకున్న శ్రీదేవి సోడా సెంటర్.. విడుదల ఎప్పుడంటే..