Aaradhya Bachchan: ఐశ్వర్యరాయ్ కూతురు భవిష్యత్ ఇలాగే ఉంటుందట.. షాకింగ్ విషయాలు చెప్పిన ప్రముఖ జ్యోతిష్యురాలు

ఐశ్వర్యారాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇంకా సినిమాల్లోకి అడుగు పెట్టలేదు కానీ ఇప్పటికే స్టార్ కిడ్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఎక్కువగా తల్లి కొంగు చాటునే కనిపించే ఆరాధ్య గురించి ఓ ప్రముఖ జ్యోతిష్య నిపుణురాలు ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Aaradhya Bachchan: ఐశ్వర్యరాయ్ కూతురు భవిష్యత్ ఇలాగే ఉంటుందట.. షాకింగ్ విషయాలు చెప్పిన ప్రముఖ జ్యోతిష్యురాలు
Aaradhya Bachchan

Updated on: Apr 22, 2025 | 4:51 PM

ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న ది మోస్ట్ రొమాంటిక్ కపుల్స్ లో ఐశ్వర్య, అభిషేక్ జంట ఒకటి. వీరి వైవాహిక జీవితం గురించి ఎన్నో రూమర్లు నడుస్తున్నా ఇప్పటికీ వీరిని ది బెస్ట్ కపుల్ గానే పరిగణిస్తారు. ఐశ్వర్య, అభిషేక్ 2007 లో వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన నాలుగు సంవత్సరాల తర్వాత అంటే 2011 లో ఐశ్వర్యకు ఆరాధ్య జన్మించింది. ప్రస్తుతం ఈ స్టార్ కిడ్ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతోంది. స్టడీ పరంగా ఆరాధ్య చాలా చురుకైన విద్యార్థిని. పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తోంది. ఆ మధ్యన ఆరాధ్య బచ్చన్ షారుఖ్ ఖాన్ కుమారుడు అబ్‌రామ్ ఖాన్‌తో కలిసి ఒక షోలో నటించింది. దీన్ని చూసిన వారు ఐశ్వర్య లాగే ఆరాధ్య కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయమంటున్నారు? తాజాగా ఇదే విషయంపై ప్రముఖ జ్యోతిష్య నిపుణురాలు, టారో కార్డ్ రీడర్ గీతాంజలి సక్సేనా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. భవిష్యత్ లో ఆరాధ్య జీవితం ఎలా ఉండనుందో అంచనా వేసింది.

ఐశ్వర్య లాగే..

‘ఐశ్వర్య లాగే ఆరాధ్యది కూడా స్వతంత్ర్య, ప్రభావవంతమైన వ్యక్తిత్వం. చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. ఈ గుణం వల్లే ఆమె నటనలో భావోద్వేగాలను సులభంగా వ్యక్తపరచగలదు. ఐశ్వర్య లాగే ఆరాధ్య కూడా భవిష్యత్‌లో ఓ మంచి సినిమా స్టార్ అవుతుంది. అయితే తన ప్రయాణం కూడా వివాదాలు, సవాళ్లతో నిండి ఉంటుంది’

ఇవి కూడా చదవండి

ఐశ్వర్య, అభిషేక్ లతో ఆరాధ్య బచ్చన్..

ఒడిదొడుకులు ఎదురైనా..

‘ న్యూమరాలజీ ప్రకారం ఆరాధ్యబచ్చన్ ది 7 తో పాటు 4 కలయిక అంటే కష్టాలను బాగా ఎదుర్కొంటుంది. అయితే తనకు ఆత్మవిశ్వాసం ఎక్కువ. అందుకే ఆమె వాటన్నింటినీ అధిగమించి విజయం సాధిస్తుంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా, తన కుటుంబ సభ్యుల మద్దతుతో వాటిని అధిగమిస్తుంది’ అని చెప్పుకొచ్చారు గీతాంజలి సక్సేనా.

కాగా ఇప్పటికే ఐశ్వర్యతో పాటు సినిమా ఈవెంట్స్, అవార్డుల ఫంక్షన్లు  చుట్టేస్తోంది ఐశ్వర్య. తన లుక్స్, బిహేవియర్ తో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తోంది. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ కూతురైనా పబ్లిక్ ప్లేసుల్లో ఎంతో ఒద్దికగా, ఎలాంటి హంగామా, ఆర్భాటాలు లేకుండా కనిపిస్తోంది ఆరాధ్య. తద్వరా నడవడికలో తల్లి అడుగుజాడల్లోనే నడుస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది.

తాత బిగ్ బీతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.