Adipurush: మరో వివాదంలో ‘ఆదిపురుష్’.. వానర సైన్యాన్ని తక్కువ చేసి చూపారంటూ పిటిషన్! రేపు విచారణ

|

Oct 09, 2022 | 11:33 AM

జనవరి 12, 2023 న విడుదల కానున్న రాబోయే చిత్రాన్ని .. మతపరమైన భావాలను దృష్టిలో ఉంచుకుని.. దీని పాత్రల రూపకల్పన విషయాన్ని పునఃపరిశీలించాలని కోరారు.

Adipurush: మరో వివాదంలో ఆదిపురుష్.. వానర సైన్యాన్ని తక్కువ చేసి చూపారంటూ పిటిషన్! రేపు విచారణ
Adipurush
Follow us on

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ‘ఆదిపురుష’ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచి నిత్యం వివాదం నడుస్తోంది. తాజాగా ఈ సినిమా విడుదలపై స్టే విధించాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ‘ఆదిపురుష్ ‘ లో  శ్రీరాముని చూపిన విధానం, హనుమంతుడు తోలు కట్టు ధరించి చూపించింది అన్యాయంగా ఉందని.. చాలా తప్పుగా చిత్రీకరించారని పిటిషన్‌లో పేర్కొన్నారు . అదేవిధంగా, రావణుడి ఉనికిని కూడా ప్రస్తావించారు.

‘ఆదిపురుష’పై పిటిషన్ దాఖలు:
భూషణ్ కుమార్, ఓం రౌత్‌లపై న్యాయవాది రాజ్ గౌరవ్ పిటిషన్ వేశారు. తీస్ హజారీ కోర్టు సీనియర్ సివిల్ జడ్జి అభిషేక్ కుమార్ ఎదుట సోమవారం విచారణ జరగనుంది. ఆరోపణల ప్రకారం..  సినిమాలోని పాత్రల చిత్రీకరణ విధానం మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని పిటిషన్ లో పేర్కొన్నారు. అంతేకాదు  “టీజర్ లో రాముడిని చూపించిన విధానం పై కూడా పలు ఆరోపణలు చేశారు.  నిర్మాత యూట్యూబ్ లో అప్‌లోడ్ చేసిన టీజర్‌లో హనుమంతుడు, రాముడు తోలు వస్తువులను ధరించినట్లు చూపించారు.. అయితే పురాణాల వర్ణనకు ఇది విరుద్ధమని తెలిపారు. రాజా రవివర్మ పెయింటింగ్, సీరియల్ ‘రామాయణం’లో రామాయణం పాత్రలు మంచి పద్ధతిలో చిత్రీకరించబడ్డాయి. అయితే ఆదిపురుష్ లో శ్రీరాముడిని “నిరంకుశుడు, ప్రతీకారం , కోపంతో” ఉన్నట్లు చిత్రీకరించడానికి ప్రయత్నించాడు. అంతేకాదు హనుమంతుని వర్ణనకు విరుద్ధమని కూడా పిటిషన్ లో ఆరోపించారు.

వానర సైన్యాన్ని ‘చింపాంజీల మంద’గా చిత్రీకరించారు
రాముడి పాత్రతో పాటు, రావణుడి (సైఫ్ అలీఖాన్) పాత్రపై కూడా సందేహాలు లేవనెత్తారు.  ఈ చిత్రం ‘అత్యంత చవకబారు వర్ణన అంటూ సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు రావణాసుడుని కూడా భయపెట్టే విధంగా చూపించారని.. వానర సైన్యాన్ని కూడా “చింపాంజీల మంద”గా చూపించారని ఆరోపించారు.

ఇవి కూడా చదవండి

ఈ చిత్రం 12 జనవరి 2023న విడుదల:
ఈ పిటిషన్‌లో, “సినిమా టీజర్ లేదా ప్రోమో చాలా క్రూరంగా..  పాపభరితంగా ఉందని ఆరోపించారు. జనవరి 12, 2023 న విడుదల కానున్న రాబోయే చిత్రాన్ని .. మతపరమైన భావాలను దృష్టిలో ఉంచుకుని.. దీని పాత్రల రూపకల్పన విషయాన్ని పునఃపరిశీలించాలని కోరారు. భారతదేశంలో ..  ఇతర ప్రాంతాల్లో హిందువుల మనోభావాలు, ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని ఆదిపురుష్ సినిమాను పూర్తిగా నిషేధించాలని కోరారు. ఈ పిటిషన్‌లో.. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల నుండి ‘ఆదిపురుష్’ ప్రమోషన్ వీడియోను తొలగించాలని డిమాండ్ చేశారు.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..