సుదీప్తో సేన్ చిత్రం ‘ది కేరళ స్టోరీ’ బాక్సాఫీస్ వద్ద సక్సెస్ తో దూసుకుపోతుంది. రెండో వారాంతంలో ఈ సినిమా 150 కోట్లకు చేరువలో వసూళ్లు రాబట్టింది. కేరళ స్టోరీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. విడుదలైన రెండవ సోమవారం చక్కగా వసూళ్లు సాధించింది. ఈ ఏడాదిలో తక్కువ సమయంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో కేరళ స్టోరీ రెండవ స్థానానికి చేరుకుంది. గతంలో షారుఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ చిత్రం అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా మొదటి ప్లేస్ లో నిలిచింది.
కేరళ స్టోరీ వీకెండ్ లో కలెక్షన్ల వర్షం కురిపించింది. దీంతో ఈ మూవీ విడుదలైన 11 రోజుల్లోనే టోటల్ గా నెట్ కలెక్షన్ దాదాపు 150 కోట్లకు వసూలు చేసింది. విడుదలైన రెండో సోమవారం ఈ సినిమా రెండంకెల వసూళ్లు రాబట్టింది. సోమవారం ఈ సినిమా 10.5 కోట్లు రాబట్టింది. కేరళ స్టోరీ ముంబై సర్క్యూట్‌లో భారీ బిజినెస్ చేస్తోంది. అదే సమయంలో.. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ చిత్రం తన సత్తాను కొనసాగిస్తోంది.
ది కేరళ స్టోరీ 200 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందని ట్రేడ్ వర్గాల నిపుణుల అంచనా వేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమా రోజు రోజుకీ ఆదరణ పెరిగిపోతుంది.. దీంతో వసూళ్లు నానాటికీ పెరుగుతున్నాయని.. కేరళ స్టోరీ ఈజీగా 250 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందనని భావిస్తున్నారు. దీంతో కేరళ స్టోరీ ఈ సంవత్సరంలో రెండవ అతిపెద్ద బాలీవుడ్ చిత్రం అవుతుంది.
#TheKeralaStory crosses HALF-CENTURY in *Weekend 2* [Fri to Sun]… Records its *highest single day* number on [second] Sun… Inches closer to ₹ 150 cr, speeding towards ₹ 200 cr… [Week 2] Fri 12.35 cr, Sat 19.50 cr, Sun 23.75 cr. Total: ₹ 136.74 cr. #India biz. #Boxoffice… pic.twitter.com/lMq2xT8lm0
— taran adarsh (@taran_adarsh) May 15, 2023
అదా శర్మ ప్రధాన పాత్రలో నటించిన ది కేరళ స్టోరీ మూవీ అలియా భట్ నటించిన గంగూబాయి కతియావాడిని వసూళ్ల పరంగా వెనక్కి నెట్టింది. ఇప్పుడు ఈ సినిమా వసూళ్ల పరంగా కంగనా రనౌత్ నటించిన ‘తను వెడ్స్ మను రిటర్న్స్’ని వెనక్కు నెట్టేందుకు సిద్ధమైంది. ఈ విధంగా కేరళ స్టోరీ అత్యధిక వసూళ్లు రాబట్టిన హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా రికార్డులకెక్కబోతోంది.
అదే సమయంలో ఇతర దేశాల్లోనూ ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ఆస్ట్రేలియాలో ఈ సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్త కలెక్షన్లను పరిశీలిస్తే, వివేక్ అగ్నిహోత్రి చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ సమానంగా ది కేరళ కథ సినిమా వసూళ్లను రాబట్టే దిశగా అడుగులు వేస్తోంది.ది కాశ్మీర్ ఫైల్స్ మూవీ గతేడాది 340 కోట్లకు పైగా రాబట్టిన సంగతి తెలిసిందే..
మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..