Tanushree Dutta: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరోయిన్.. ఉజ్జయిని ఆలయానికి వెళ్తుండగా..

ప్రముఖ బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా (Tanushree Dutta) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయానికి వెళ్తున్న సమయంలో

Tanushree Dutta: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ హీరోయిన్.. ఉజ్జయిని ఆలయానికి వెళ్తుండగా..
Tanushree Dutta

Updated on: May 03, 2022 | 8:56 PM

ప్రముఖ బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా (Tanushree Dutta) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయానికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. కారు బ్రేకులు ఫెయిల్‌ కావడంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా తనుశ్రీ దత్తా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి ఫొటోలను షేర్‌ చేసారు. తన కాళ్లకు గాయాలు కావడంతో చికిత్స అనంతరం కుట్లు వేశారని తెలిపింది తను శ్రీ. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఆమె చికిత్స తీసుకొని ఉజ్జయిని ఆలయానికి చేరుకొని మహాకాళేశ్వరుడిని దర్శించుకున్నారు. ‘ఇది నా జీవితంలో మొదటి రోడ్డు ప్రమాదం. ఇది నా విశ్వాసాన్ని బలపరిచింది. ఈ రోజు ఓ సాహసోపేతమైన రోజు. ప్రమాదం జరిగినప్పటికీ నేను మహాకాళేశ్వరుడిని దర్శనం చేసుకున్నాను. గుడికి వెళుతుండగా బ్రేక్ ఫెయిల్ కావడంతో నా కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం కారణంగా కొన్ని కుట్లు పడ్డాయి. మహాకాళేశ్వర్ దయతో స్వల్ప గాయాలతో బయటపడ్డాను’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది తను శ్రీ.

నా నమ్మకం గుడ్డిది కాదు.. ప్రతిదీ అనుభూతి చెందుతుంది. జీవితం ఊబిలో చిక్కుపోతున్నప్పుడు.. నా ఆత్మవిశ్వాసమే నన్ను కాపాడుతుంది. ఇలాంటి సమయంలో కూడా అదే నన్ను కాపాడింది. ఆ భయంకరమైన సమయంలో నా గుండెల్లో ఒక చిన్న అలికిడి నేను క్షేమంగానే ఉంటాను అని చెప్పినట్లుగా అనిపించింది. ఎముకలు విరగకూడదు.. ఎక్కువగా ప్రమాదం జరగకూడదు అనే ప్రార్థించాను.. ప్రస్తుతం నేను బాగున్నాను.. ఏదైనా నమ్మకంతోనే జీవించాలి.. ఏది జరిగినా నా మంచికే జరుగుతుంది. రేపనేది మనకు మంచి రోజు వస్తుంది అంటూ షేర్ చేసింది తనుశ్రీ. అలాగే ఆదివారాలు.. సోమవారం ఎలాంటి చెడు జరగదని తన నమ్మకమని.. కానీ ప్రస్తుతం జరిగిన ప్రమాదం ఎలా జరిగిందనేది అర్థం కావడంలేదని.. కానీ ఒక విధంగా అది మంచికే జరిగిందని తెలిపింది. ఏదో అద్భుతం జరిగి.. దేవుడు తనకు చెడు జరగకుండా కాపాడాని… రేపటి కోసం ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Also Read: Keerthy Suresh: మహేష్ బాబును మూడు సార్లు కొట్టాను.. ఆసక్తికర కామెంట్స్ చేసిన కీర్తి సురేష్..

Megastar Chiranjeevi: పాండమిక్ తర్వాత తొలిసారి చిరంజీవి అలా.. చాలాకాలం తర్వాత సతీమణితో చిరు సెల్ఫీ..

God Father: సల్మాన్‏తో చిరు మాస్ బీట్.. ఇండియన్ మైకెల్ జాక్సన్ కొరియోగ్రఫీలో..

Rama Rao On Duty Movie: మాస్ మాహారాజా సినిమా నుంచి ఫెస్టివల్ అప్డేట్.. మరో సాంగ్ రిలీజ్ అయ్యేది అప్పుడే..