
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన ఆమె ఇప్పుడు హాలీవుడ్ రేంజ్‌కు ఎదిగిపోయింది. ప్రస్తుతం అక్కడ పలు సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంటుందామె. ప్రియాంక నటించిన సిటాడెల్ వెబ్ సిరీస్ ఇటీవల విడుదలైంది. దీనికి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కాగా అమెరికన్ పాప్ సింగర్ నిక్ జొనస్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత లాస్ ఏంజెలిస్‌లోనే సెటిలైపోయింది ప్రియాంక. అయితే తరచుగా ఇండియాకు వస్తూనే ఉంటోంది. అలా ఇటీవల ముంబయిలో నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి మొదటిసారి బిడ్డతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే ఇటీవల సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పదం బాగా వినిపిస్తుంది. ఇటీవల యాపిల్ బ్యూటీ హన్సిక కూడా ఒక స్టార్ హీరో తనను వేధించారని చెప్పుకొచ్చింది. ఇప్పుడు గ్లోబల్ స్టార్ ప్రియాంకా చోప్రా కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుల జాబితాలో చేరింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి షేర్ చేసుకుంది. ఓ స్టార్ డైరెక్టర్ ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. ఓ బాలీవుడ్ దర్శకుడు తన లో దుస్తులను చూడాలని బలవంత పెట్టాడని పేర్కొంది.
‘2002-03 మధ్య కాలం. నేను అప్పుడప్పుడే బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాను. ఒక సినిమాకు కూడా ఒకే చెప్పాను. అందులో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు దర్శకుడు నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు లో దుస్తులన్నీ తీసేయాలన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అందుకు నేను ఒప్పుకోలేదు. ఆ మరుసటి రోజే నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా. ఇందులో నాకు నటించడం ఇష్టం లేదు. అయితే ఈ విషయం గురించి దర్శకుడికిపై ఎక్కడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. నిరసన తెలిపేందుకు చాలా భయపడ్డాను. అయితే ఈ విషయంపై చాలా బాధపడ్డాను ‘అని ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ప్రియాంక.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.