Neena Gupta: సెల్స్ గర్ల్‏గా మారిన నటి.. అసహనం వ్యక్తం చేసిన సీనియర్ నటి…. అసలు విషయం చెప్పిన నీనా గుప్తా…

సినీ పరిశ్రమలో అదృష్టం ఉంటే.. ఆకాశానికి ఎదుగుతారు.. అదే కాస్తా అటు ఇటు మారిన జీవితం తారుమారైపోతుంది. అలాగే.. కొంతమంది నటీనటులు

Neena Gupta: సెల్స్ గర్ల్‏గా మారిన నటి.. అసహనం వ్యక్తం చేసిన సీనియర్ నటి.... అసలు విషయం చెప్పిన నీనా గుప్తా...
Neena Gupta
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 26, 2021 | 9:17 AM

సినీ పరిశ్రమలో అదృష్టం ఉంటే.. ఆకాశానికి ఎదుగుతారు.. అదే కాస్తా అటు ఇటు మారిన జీవితం తారుమారైపోతుంది. అలాగే.. కొంతమంది నటీనటులు కాస్తా సినిమాలకు దూరంగా ఉంటే.. వారి గురించి రకారకాల వార్తలు వినిపిస్తుంటాయి. అలాగే తన గురించి కూడా కొన్ని ఫేక్ ఆర్టీకల్స్ వచ్చాయని అంటున్నారు బాలీవుడ్ సీనియర్ నటి నీనా గుప్తా. చిత్ర పరిశ్రమలోకి వచ్చిన కొత్తలో తన గురించి ఫేక్ ఆర్టీకల్స్ రాసారని గుర్తుచేసుకున్నారు. కాగా సచ్ కహున్ అనే పేరుతో నినా స్వయంగా తన ఆత్మకథ రాసుకున్నారు. ఇటీవల ఆ బుక్ ను ఆమె విడుదల చేశారు. ఈ బయోగ్రఫి ప్రమోషన్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె తన ఆత్మకథకు సంబంధించిన విషయాలపై ముచ్చటించారు. ఈ నేపథ్యంలో కెరీర్ ప్రారంభంలో సేల్స్ గర్ల్ గా పని చేసినట్లు వచ్చిన తప్పుడు ఆర్టికల్ చదివి షాకయ్యానని చెప్పారు.

” నా గురించి చాలా సార్లు తప్పుడు వార్తలు వచ్చాయి. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ మ్యాగజైన్ లో శ్యామ్ ఆహుజా షాప్ లో నేను సేల్స్ గర్ల్ గా చేరినట్లు అసత్యపు వార్తలు రాసినట్లు నాకు ఇప్పటికీ గుర్తుంది. అయితే ఆ సమయంలో నాకు నిజంగా శ్యామ్ ఆహుజా ఎవరో తెలియదు. ఆ ఆర్టికల్ చదివిన తర్వాత నేను స్నేహితులను అడిగాను. అప్పుడు వారు ఆయన ఓ వ్యాపారవేత్త అని ఆయనకు ఓ కార్పెట్ షాప్ ఉందని చెప్పారు. అది విని షాకయ్యాను. అలాంటి తప్పుడు వార్తలు ఎలా రాస్తారో అర్థం కాదు.. నేనెందుకు ఆయన షాప్ లో పనిచేస్తాను” అంటూ అసహనం వ్యక్తం చేశారు నీనా గుప్తా.. తన జీవితంలో ఓ తప్పుడు వ్యక్తిని నమ్మడం కారణంగా… ప్రొఫెషనల్ లైఫ్ పై ప్రభావం చూపించిందని.. నటిగా సక్సెస్ ఫుల్ కెరీర్ లో ఉన్నప్పుడు నటనను ఆపేశానని చెప్పుకోచ్చారు.

Also Read: Barmer District Collector: పిల్లల క్రియేటివిటీని మెచ్చుకున్న కలెక్టర్.. ఆ ఊరికి వరమిచ్చి వెళ్లారు.. ఇంతకీ వాళ్లు ఏంచేశారంటే..!

Viral Photo: రెండు కుటుంబాల మధ్య గొడవ.. చెట్టును ఎలా మార్చారో చూడండి! వైరలవుతోన్న ఫొటో

MAA Elections 2021: “మా” ఎన్నికలు.. సీనియర్లతో జీవితా రాజశేఖర్ సంప్రదింపులు.. సూపర్ స్టార్ కృష్ణ సపోర్ట్ కోరనున్న….