AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Casting Couch: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే వారికి అలా కనిపించాల్సిందే… సంచలన కామెంట్స్ చేసిన అందాల తార.

Nargis Fakhri: హాలీవుడ్ నుంచి టాలీవుడ్‌ వరకు వినిపించే పదం కాస్టింగ్‌ కౌచ్‌. మరీ ముఖ్యంగా గత కొన్ని నెలల క్రితం ఈ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. సినిమాల్లో నటించే అవకాశం సొంతం చేసుకోవాలంటే...

Casting Couch: సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే వారికి అలా కనిపించాల్సిందే... సంచలన కామెంట్స్ చేసిన అందాల తార.
Nargis Casting Coush Commen
Narender Vaitla
|

Updated on: Aug 09, 2021 | 7:37 AM

Share

Nargis Fakhri: హాలీవుడ్ నుంచి టాలీవుడ్‌ వరకు వినిపించే పదం కాస్టింగ్‌ కౌచ్‌. మరీ ముఖ్యంగా గత కొన్ని నెలల క్రితం ఈ అంశం పెద్ద చర్చకు దారి తీసింది. సినిమాల్లో నటించే అవకాశం సొంతం చేసుకోవాలంటే హీరోయిన్‌లు దర్శక, నిర్మాతలకు ఫేవర్‌ చేయాల్సిందేనంటూ కొందరు నటీమణులు ఓపెన్‌గానే స్టేట్‌మెంట్ ఇచ్చారు. ఒక్కో హీరోయిన్‌ బయటకు వస్తూ తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఏకరవు పెట్టారు. అప్పట్లో ఈ వార్తలు సంచలనం సృష్టించాయి. అయితే ఇటీవల ఈ సమస్య కాస్త సద్దుమణిగిందని అంతా అనుకున్నారు. కానీ ఈ సమయంలోనే బాలీవుడ్ బ్యూటీ నర్గీస్‌ ఫక్రీ మరోసారి పెద్ద దుమారానికి తెర తీశారు.

సినీ పరిశ్రమలో తాను ఎదుర్కొన్న సమస్యలను చెప్పుకొచ్చిందీ బ్యూటీ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. మొదటి సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటే ఏ హీరోయిన్‌కైనా వరుస ఆఫర్లు క్యూ కడతాయి. కానీ తన విషయంలో మాత్రం దీనికి విరుద్ధంగా జరిగిందని వాపోయింది నర్గీస్‌. సినిమా ఇండస్ట్రీలో, ముఖ్యంగా బాలీవుడ్‌లో రాణించాలంటే దర్శక, నిర్మాతల కోరికలను తీర్చాలని షాకింగ్ కామెంట్స్‌ చేసింది నర్గీస్‌. అంతటితో ఆగకుండా సినిమాల్లో అవకాశాలు రావాలంటే వారికి కచ్చితంగా నగ్నంగా కనిపించాల్సిందే అంటూ కుండ బద్దలు కొట్టింది. ఇక తనను కొందరు బడా దర్శక, నిర్మాతలు కమిట్‌మెంట్‌ అడిగారని, దానికి తాను ఒప్పుకోకపోవడంతో కొందరు ఆఫర్లు రాకుండా చేశారని నర్గీస్‌ ఆరోపించింది. ఇదిలా ఉంటే నర్గీస్‌ తన తొలి చిత్రం ‘రాక్‌ స్టార్‌’తోనే ఉత్తమ డెబ్యూ హీరోయిన్‌గా ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డును గెలుచుకుంది. నర్గీస్‌ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.

Also Read: Ram Gopal Varma: విజయేంద్ర ప్రసాద్ గడ్డం పై వర్మ సంచలన కామెంట్స్.. అంతమాట అనేశాడేంటి..!!

Kiara Advani RC 15: కియారా జోరు మాములుగా లేదుగా.. చెర్రీ సినిమాకు ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

Prabhas: సలార్ బ్యూటీకి సర్‌ప్రైజ్ ఇచ్చిన పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్.. ‘డార్లింగ్’ ఎపుడూ ఇంతే అంటోన్న నెటిజన్లు