AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kiara Advani RC 15: కియారా జోరు మాములుగా లేదుగా.. చెర్రీ సినిమాకు ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.

Kiara Advani RC 15: 2014లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం 'ఫగ్లీ'తో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది అందాల తార కియారా అద్వానీ. తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది అనతి కాలంలో...

Kiara Advani RC 15: కియారా జోరు మాములుగా లేదుగా.. చెర్రీ సినిమాకు ఎంత తీసుకుంటుందో తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే.
Kirara Advani
Narender Vaitla
|

Updated on: Aug 09, 2021 | 7:10 AM

Share

Kiara Advani RC 15: 2014లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘ఫగ్లీ’తో చిత్ర పరిశ్రమకు పరిచయమైంది అందాల తార కియారా అద్వానీ. తొలి చిత్రంతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసిన ఈ చిన్నది అనతి కాలంలో బాలీవుడ్ అగ్ర హీరోయిన్‌ల జాబితాలో చోటు దక్కించుకుంది. ఇక నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చిన ‘లస్ట్‌ స్టోరీస్‌’ వెబ్‌ సిరీస్‌లో బోల్డ్‌ పాత్రలో కనిపించిన కియారా ఒక్కసారిగా అందరినీ షాక్‌కు గురిచేసింది. ఈ బ్యూటీ హవా బాలీవుడ్‌కు మాత్రమే పరిమితం కాలేదు. ‘భరత్‌ అనే నేను’ చిత్రంతో టాలీవుడ్‌లోనూ పాగా వేసింది. ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో రెండో సినిమా రామ్‌ చరణ్‌తో నటించే ఛాన్స్‌ కొట్టేసింది బ్యూటీ.

ఇదిలా ఉంటే తాజాగా మరోసారి చెర్రీతో నటించనుంది కియారా. తమిళ దర్శకుడు శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో కియారా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆర్‌ 15 వర్కింగ్ టైటిల్‌ ఖరారు చేసిన ఈ సినిమాలో నటించడానికి కియారా భారీగా తీసుకుంటున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. సాధారణంగా కియారా సినిమాకు రూ. 4 కోట్లు తీసుకుంటుంది. అయితే ఈ సినిమాకు కోటి రూపాయలు పెంచి రూ. 5 కోట్లు డిమాండ్‌ చేసిందని సమాచారం. అయితే చిత్ర యూనిట్‌ రూ. 4.50 కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లు తాజాగా వార్తలు గుప్పుమంటున్నాయి. దీంతో కియారా రెమ్యునరేషన్‌ విషయం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఈ సినిమా పాన్‌ ఇండియా నేపథ్యంగా తెరకెక్కుతుండడం, ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌లో మంచి క్రేజ్‌ ఉండడమే మేకర్స్‌ ఆమె కోరిన రెమ్యునరేషన్‌ ఇవ్వడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Happy birthday Mahesh babu : సంచలనాలకు మారుపేరు ఈ సూపర్ స్టార్.. హ్యాపీ బర్త్ డే హ్యాండ్సమ్ హీరో మహేష్ బాబు..

Payal Rajput: కన్నడలో పాగా వేయడానికి సిద్ధమైన అందాల ముద్దుగుమ్మ.. హెడ్‌ బుష్‌తో రానున్న పాయల్‌.

గూగుల్ నుంచి డిలీట్ చేసిన ఫొటోలు కావాలా.. అయితే ఈ సింపుల్ చిట్కాలను పాటించండి..!