Krithi Sanon: భారీ ఆఫర్ అందుకున్న కృతి సనన్ ?‏… హాలీవుడ్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ రీమేక్‏లో బాలీవుడ్ బ్యూటీ..

|

Jun 24, 2021 | 8:32 AM

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనోక్కడినే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కృతి సనన్. కానీ సినిమా తర్వాత టాలీవుడ్ లో

Krithi Sanon: భారీ ఆఫర్ అందుకున్న కృతి సనన్ ?‏... హాలీవుడ్ మార్షల్ ఆర్ట్స్ ఫిల్మ్ రీమేక్‏లో బాలీవుడ్ బ్యూటీ..
Kriti Sanon
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన వన్ నేనోక్కడినే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కృతి సనన్. కానీ సినిమా తర్వాత టాలీవుడ్ లో అంతగా అవకాశాలను అందుకోలేకపోయింది కృతి. ఆ తర్వాత తెలుగు నుంచి బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ అమ్మడు.. అక్కడ మాత్రమే వరుస ఆఫర్లతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. డైరెక్టర్ ఓంరౌత్ కాంబోలో వస్తున్న ఆదిపురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తుంది. తాజాగా కృతికి మరో భారీ ఆఫర్ వచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.

హాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కిల్ బిల్ హిందీ రీమేక్ లో నటించే ఛాన్స్ దక్కించుకున్నట్లు బీ టౌన్ లో కథనాలు వస్తున్నాయి. క్వాంటిన్ టరంటినో డైరెక్షన్ లో వచ్చిన కిల్ బిల్ సిరీస్.. క్లాసిక్స్ లిస్టులో టాప్ ప్లేస్ లో నిలిచాయి. ఉమ తుర్మన్ మెయిన్ రోల్ లో 2003, 2004 లో రెండు భాగాలుగా విడుదలై.. అకాడమీ అవార్డులకు కూడా ఎంపికయ్యింది. సినీ హిస్టరీలోనే బెస్ట్ రివేంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీని త్వరలోనే హిందీలో కూడా తీయనున్నారు. దీనికి సంబంధించిన రిమేక్ హక్కులను.. నిఖిల్ ద్వివేదీ దక్కించుకున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పై సీరియస్ వర్క్ చేస్తున్న డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, నిఖిల్ ద్వివేదీ.. ప్రీ ప్రొడక్షన్ వర్క్ బిజీలో ఉన్నారు. అలాగే నటీనటుల ఎంపికపై కూడా కసరత్తు చేస్తున్నారు. ఈ మూవీలోకి కృతిని సెలక్ట్ చేసుకున్నారట మేకర్స్. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది.

Also Read: Hyderabad MMTS Trains: హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. ఈ రోజు నుంచి పరుగులు పెట్టనున్న ఎంఎంటీఎస్ రైళ్లు

Dowry Harrassment: వరకట్నం కాటేసింది.. భర్త వేధింపులకు యువతి ఆత్మహత్యాయత్నం.. నాలుగు రోజులుగా చికిత్సపొందుతూ మృతి!

Cluster Fig Benefits: అత్తి పళ్లతో ఈ వ్యాధులకు చెక్.. డయాబెటిస్ ఉన్నవారు ఈ పళ్లను తినోచ్చా ?