Kareena Kapoor: ‘దయచేసి మా సినిమాను బహిష్కరించకండి’.. చేతులు జోడించి వేడుకున్న హీరోయిన్..

డైరక్టర్ అద్వైత్ చందన్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదల ఈ సినిమా ఆశించినంతస్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది.

Kareena Kapoor: 'దయచేసి మా సినిమాను బహిష్కరించకండి'.. చేతులు జోడించి వేడుకున్న హీరోయిన్..
Kareena Kapoor
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 14, 2022 | 6:26 PM

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన లాల్ సింగ్ చద్దా ఆగస్ట్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. డైరక్టర్ అద్వైత్ చందన్ తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదల ఈ సినిమా ఆశించినంతస్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసినప్పటినుంచి బాయ్‏కాట్ లాల్ సింగ్ చద్దా (Laal Singh Chaddha) ట్యాగ్ లైన్ ట్రెండ్ అవుతుంది. ఈ చిత్రాన్ని ఎవరు చూడవద్దని.. బహిష్కరించాలంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. దీంతో లాల్ సింగ్ చద్దా కలెక్షన్స్ తగ్గిపోయాయి. తాజాగా ఈ సినిమా పై వస్తున్న నెగిటివ్ ప్రచారం గురించి హీరోయిన్ కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ.. ” సోషల్ మీడియాలో కొందరు మాత్రమే కావాలని మా సినిమాను ట్రోల్ చేస్తున్నారు. కానీ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన మరోలా ఉంది. కేవలం టార్గెట్ చేసి సినిమాపై నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. ఇది అద్భుతమైన చిత్రం. కచ్చితంగా తెరపై చూడాల్సిన సినిమా ఇది. దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ చిత్రాన్నితెరపై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నెగిటివ్ ప్రచారం చూసి మంచి సినిమాను బహిష్కరించవద్దు. 2.5 సంవత్సరాలకు పైగా దాదాపు 250 మంది ఈ సినిమా కోసం పనిచేశారు. దయచేసి ఈ చిత్రాన్ని బహిష్కరించకండి ” అంటూ విజ్ఞప్తి చేసింది. తొలిరోజు ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 11.50 కోట్లు వసూలు చేసింది. హాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ ఫారెస్ట్ గంప్‏కు రీమేక్‏గా లాల్ సింగ్ చద్దా చిత్రాన్ని తెరకెక్కించగా.. ఇందులో అక్కినేని నాగచైతన్య కీలకపాత్రలో నటించారు.

పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
పదోతరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు గడువు మళ్లీ పెంపు.. ఎప్పటి వరకంటే?
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
రేపు అయ్యప్ప మండల పూజ.. భక్త జన సంద్రంగా శబరిమల..
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
బలపడిన అల్పపీడనం.. వచ్చే 3రోజులు వానలే వానలు! పిడుగులు పడే ఛాన్స్
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్..
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి