కంగన రనౌత.. నిత్యం ఎదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. స్టార్ హీరోలపై తనదైన స్టైల్లో కామెంట్స్ చేయడమే కాకుండా..సమాజంలో జరుగుతున్న ఘటనలపై స్పందిస్తూ వివాదాస్పదమవుతుంటుంది. అయితే ప్రముక లిరిసిస్ట్ జావేద్ అక్తర్‌తో కంగన వివాదం కోర్టుల మధ్య ఉన్న సంగతి తెలిసిందే. తనపై అంధేరిలోని 10వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ప్రారంభించిన మొత్తం చర్యలను రద్దు చేయాలని కోరుతూ.. కంగనా రనౌత్ ముంబై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇది భారతీయ శిక్షాస్మృతిలోని 499, 500 సెక్షన్ల క్రింద జావేద్ సమర్పించిన ఫిర్యాదుకు పూర్తి కౌంటర్ పిటిషన్. అయితే కంగనా ఈ కేసును మేజిస్ట్రేట్ ప్రారంభించినట్లుగా తెలిపారు.
న్యాయపరమైన పరిశోధన లేకుండా..ప్రమాణంపై ఫిర్యాదులో పేర్కొన్న సాక్షులను విచారించడంలో విఫలమైనందున సెక్షన్ 200 ప్రకారం .. సీఆర్సిసీ సెక్షన్ 202 (2) ప్రకారం సీఆర్పీసీ సెక్షన్ 162లోని నిబంధనలను ఉల్లంఘించారు. పోలీసులు సేకరించిన అదే సాక్షి స్టేట్మెంట్స్ పై మరోసారి ఆధారపడేందుకు ప్రయత్నించారు. వారి సంతకాలను మరోసారి సేకరించారు అని కంగన తెలిపారు. ఇంతకుముందు జావేద్ అక్తర్ తన పాస్‌పోర్ట్ పొందడానికి కంగన రనౌత్ పై ఫిర్యాదు చేశారు. తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని.. తప్పుడు ఆరోపణలు చేసినట్లుగా బాలీవుడ్ గేయ రచయిత చెప్పారు. మార్చిలో కంగన కోర్టుకు హజరుకావాలని ఆదేశించగా.. రాకపోవడంతో.. ఆమెకు బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.
కంగనా న్యాయవాది రిజ్వాన్ సిద్ధికే ఈ విషయాన్ని కోర్టు ముందు ఎత్తిచూపారు. తర్వాత దిందోషి సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో కంగనా అభ్యర్ధనను సెషన్స్ కోర్టు కొట్టివేసింది. దీంతో కంగనా ఇప్పుడు హైకోర్టును ఆశ్రయించింది. కంగనా రనౌత్ సాక్షులను సులభంగా పోలీసులచే ప్రభావితం చేయగలదని , కోర్టులో ప్రమాణ స్వీకారం చేసిన భౌతిక సాక్షుల సాక్ష్యాలను రికార్డ్ చేయడం ఫిర్యాదుదారుడు జావేద్ అక్తర్ చేత ప్రత్యక్ష లేదా వాస్తవమైన కేసు ఏదైనా చేయబడిందా ? అని నిర్ధారించాల్సి ఉంటుంది. ఒకవేళ అది అనుమతిస్తే ఇతర న్యాయాధికారులకు తప్పుగా నిలుస్తుందని కంగనా తెలిపారు. ఇది చాలా సందర్భాలలో నిందితుల హక్కులు, స్వేచ్ఛను కూడా ప్రభావితం చేస్తుందని అన్నారు.
ఇక జావేద్ అక్తర్ తరపు న్యాయవాది జే భరద్వాజ్ హాజరుకానున్నారు. ఈ విషయం వచ్చే వారం జస్టిస్ ఎస్ఎస్ షిండే, జస్టిస్ ఎన్జే జమదార్ ధర్మాసనం ముందు విచారణ జరగనుంది. ఓ వార్త ఛానెల్లో కంగనా రనౌత్ ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత జావేద్ అక్తర్ ఆమెపై ఫిర్యాదు చేశారు. దీంతో ఫిబ్రవరి 2021లో కోర్టు కంగనాకు నోటీసులు ఇచ్చింది. అయినా కానీ కంగన కోర్టుకు హాజరు కాలేదు. దీంతో ఆమెకు మార్చిలో బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారెంట్ రద్దు చేసేందుకు కంగన కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది.
Also Read: Hansika: సింగిల్‌గానే కొత్త సినిమాను స్టార్ట్ చేసిన హన్సిక.. సింగిల్ షాట్ మూవీ అంటున్న హీరోయిన్..