Kangana Ranaut: అప్పులు కాదు.. ఆస్తులే ఎక్కువ.. కంగనా ఆస్తులు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.. ఎన్ని కిలోల బంగారం ఉందంటే..

|

May 14, 2024 | 8:38 PM

హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కంగానా పోటీ చేస్తుంది. కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. ఈరోజు మే 14న కంగనా నామినేషన్ పత్రాలను దాఖలు చేసింది. ఈ క్రమంలోనే తన ఆస్తి, వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం తన ఆస్తినంతా అమ్మేసి ఎమర్జెన్సీ సినిమా నిర్మించినట్లు తెలిపింది కంగనా. కానీ ఈరోజు అధికారిక ఆస్తి వివరాల్లో మాత్రం అప్పుల కంటే 10 రేట్లు ఎక్కువ స్థిరఆస్తులు, వారసత్వ ఆస్తులు ఉన్నట్లు తెలిసింది.

Kangana Ranaut: అప్పులు కాదు.. ఆస్తులే ఎక్కువ.. కంగనా ఆస్తులు తెలిస్తే దిమ్మతిరగాల్సిందే.. ఎన్ని కిలోల బంగారం ఉందంటే..
Kangana Ranaut
Follow us on

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈసారి బీజేపీ తరుపున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తుంది బీటౌన్ క్వీన్. కొన్నేళ్లుగా బీజేపీ పార్టీకి అనుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న కంగనా.. ఎట్టకేలకు అదే పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికలకు టిక్కెట్ అందుకుంది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ నియోజకవర్గం నుంచి కంగానా పోటీ చేస్తుంది. కొన్ని రోజులుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుంది. ఈరోజు మే 14న కంగనా నామినేషన్ పత్రాలను దాఖలు చేసింది. ఈ క్రమంలోనే తన ఆస్తి, వ్యక్తిగత విషయాలను వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం తన ఆస్తినంతా అమ్మేసి ఎమర్జెన్సీ సినిమా నిర్మించినట్లు తెలిపింది కంగనా. కానీ ఈరోజు అధికారిక ఆస్తి వివరాల్లో మాత్రం అప్పుల కంటే 10 రేట్లు ఎక్కువ స్థిరఆస్తులు, వారసత్వ ఆస్తులు ఉన్నట్లు తెలిసింది.

2022-23లో కంగనా 4.12 కోట్లు సంపాదించింది. 2021-22లో 12 కోట్ల ఆదాయం సంపాదించింది. కంగనాపై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. వాటిలో పరువు నష్టం, మతాల మధ్య శత్రుత్వం పెంచే ప్రయత్నాలు, మతపరమైన మనోభావాలకు హాని కలిగించడం, మోసం వంటి కేసులు ఉన్నాయి. అలాగే కంగనా వద్ద రూ.2 లక్షలు ఉన్నాయి. బ్యాంకుల్లో రెండు కోట్ల రూపాయలున్నాయి. ఇవే కాకుండా ఆమె 50 ఎల్‌ఐసీ పాలసీలు చేసింది. ఈ 50 ఎల్‌ఐసీ పాలసీల మెచ్యూరిటీ మొత్తం రూ. 5 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే సొంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 1.21 కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టింది. అంతేకాకుండా తన తమ్ముడు, సోదరి రంగోలి, తండ్రి తదితరులకు రూ. 9.50 కోట్ల వరకు అప్పుగా ఇచ్చినట్లు తెలిపింది. కంగనా రనౌత్ పేరు మీద నాలుగు వాహనాలు ఉన్నాయి, అందులో ఒకటి వెస్పా స్కూటర్. మిగతా మూడు వాహనాల మొత్తం విలువ రూ.5.48 కోట్లు.

కంగనా వద్ద 6.70 కిలోల బంగారు ఆభరణాలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ 5 కోట్ల రూపాయలు. 3 కోట్ల విలువైన వజ్రాభరణాలు. 60 కిలోల వెండి వస్తువులు ఉన్నాయి. వాటి విలువ 50 లక్షల రూపాయలు. కంగనా రనౌత్ మొత్తం వారసత్వం 28.73 కోట్లు. కంగనాకు వ్యవసాయ భూమి లేదు. ముంబై, మనాలి, హిమాచల్ ప్రదేశ్‌లో రెండు భవనాలు ఉన్నాయి. . వీటి ప్రస్తుత మొత్తం విలువ రూ.31.42 కోట్లు. కమర్షియల్, రెసిడెన్షియల్ మొత్తం ఆస్తి విలువ రూ.62.98 కోట్లు. అలాగే ఆమె పేరు మీద రూ. 15.58 కోట్ల అప్పు ఉన్నట్లు సమాచారం. నిర్మాణ సంస్థ అద్దె (లీజు) కోసం 1.80 కోట్ల రూపాయలు ఇచ్చింది. ఇప్పటివరకు కంగాన మొత్తం రూ. 154.57 కోట్లు సంపాదించింది. అలాగే అప్పు రూ. 17.38 కోట్లు ఉన్నట్లు తెలిపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.