Emergency: ఇందిరాగాందీగా కంగనా లుక్.. ఎమర్జెన్సీ ఫస్ట్ లుక్ చూశారా ?..

|

Jul 14, 2022 | 4:35 PM

ఇక తాజాగా అమ్మడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తనలోని వెర్సటైల్ యాక్టింగ్ ని ఈ సినిమాతో మనకు చూపించబోతున్నారు. తన

Emergency: ఇందిరాగాందీగా కంగనా లుక్.. ఎమర్జెన్సీ ఫస్ట్ లుక్ చూశారా ?..
Kangana
Follow us on

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‏కు తెలుగులోనూ ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. మనసులోని మాటలను ఉన్నది ఉన్నట్టుగా కుండబద్దలు కొట్టినట్లుగా చెప్పేస్తుంది. బీటౌన్ ఇండస్ట్రీలోని పలువురు ఫేమస్ సెలబ్రెటీలపై పలుమార్లు ఆరోపణలు చేసి చిక్కుల్లో పడిన సందర్భాలున్నాయి. ఇటీవలే ధాకడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కంగనా. అయితే ఈ మూవీ ఆమె కెరీర్‏లో డిజాస్టర్‏గా నిలిచింది. ఇక తాజాగా అమ్మడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. తనలోని వెర్సటైల్ యాక్టింగ్ ని ఈ సినిమాతో మనకు చూపించబోతున్నారు. తన హావభావాలతో.. యాక్టింగ్‌తో.. కనికట్టు చేయబోతున్నారు. భారత దేశ చరిత్రలోనే చీకటి రోజులుగా చెప్పుకునే ఎమర్జెన్సీ పరిస్థితులను తెరమీద ఆవిష్కరించబోతున్నారు. తనే ఇందిరా గాంధిగా యాక్ట్‌ చేస్తూ.. ‘ఎమర్జెన్సీ’ (Emergency) సినిమాను తెరకెక్కిస్తున్నారు.

కెరీర్ బిగినింగ్‌లో గ్లామర్‌ డాల్‌గా సినిమాలు చేసిన కంగన.. ఆ తరువాత అనేక ఛాలెంజ్‌ రోల్స్ లో నటిస్తూ.. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ‘మణికర్ణిక’ సినిమా నుంచి తనలోని డైరెక్టర్‌ను బయటపెట్టి అందర్నీ షాక్ చేశారు. ఇక ఇప్పుడు భారత ఎమర్జెన్సీ పరిస్థితులను కథగా మలిచి ‘ఎమర్జెన్సీ’ సినిమాను తీస్తున్నారు. తనే ప్రధాన పాత్రలో నటిస్తూ.. ఈ సినిమాను డైరెక్టర్ చేస్తున్నారు.. నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఇక తాజాగా ఈ సినిమా లోని తన ఫస్ట్ లుక్‌ను రివీల్ చేశారు కంగన. అచ్చం ఇందిరా గాంధీలా కనిపిస్తూ అందర్నీ మెస్మరైజ్‌ చేయడమే కాదు.. ఆమె మేనరిజాన్ని కూడా పట్టుకునే ప్రయత్నం చేశారు. అంతేకాదు ఈ ఫస్ట్ లుక్‌లో కంగన చెప్పిన డైలాగులు.. కూడా ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. “అమెరికా ప్రెసిడెంట్‌కు చెప్పండి. నా కార్యాలయంలోని ప్రతి ఒక్కరూ నన్ను సర్‌ అనే పిలుస్తారు. మేడమ్‌ అని కాదు”అంటూ ఇందిరా గాంధీలా కంగన చెప్పిన తీరు అందర్నీ కట్టిపడేస్తోంది. ఈ సినిమాపై అప్పుడే విపరీతంగా అంచనాలు పెరిగిపోయేలా చేస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.