Deepika Padukone: ముద్దు సీన్స్‏లో నటించడానికి మీ భర్త పర్మిషన్ తీసుకున్నారా ? నెటిజన్ ప్రశ్నకు కౌంటరిచ్చిన బాలీవుడ్ బ్యూటీ..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే (Deepika Padukone).. యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం గెహ్రైయాన్ (Gehraiyaan) .

Deepika Padukone: ముద్దు సీన్స్‏లో నటించడానికి మీ భర్త పర్మిషన్ తీసుకున్నారా ? నెటిజన్ ప్రశ్నకు కౌంటరిచ్చిన బాలీవుడ్ బ్యూటీ..
Deepika

Updated on: Feb 09, 2022 | 6:33 PM

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే (Deepika Padukone).. యంగ్ హీరో సిద్ధాంత్ చతుర్వేది, అనన్య పాండే ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం గెహ్రైయాన్ (Gehraiyaan) . ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ప్రచార వీడియోస్ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ఈనెల 11న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్‏లో విడుదల కానుంది. ఈ క్రమంలో చిత్రయూనిట్‏తోపాటు.. హీరోయిన్ దీపిక పదుకునే.. సిద్దాంత్ చతర్వేది ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. ఈ క్రమంలో తాను నటించడం.. రొమాంటిక్ సన్నివేశాలపై వచ్చిన కామెంట్స్ పై దీపికా స్పందించింది.

ఈ క్రమంలో సోషల్ మీడియా ద్వారా ఓ నెటిజన్ దీపికకు.. రొమాంటిక్, ముద్దు సీన్ల గురించి మీ భర్త రణవీర్ సింగ్ పర్మిషన్ తీసుకున్నారా ? ఈ విషయాలను ఆయనతో చర్చించారా ? అంటూ ఇష్టానుసారంగా కామెంట్స్ చేసాడు. దీంతో దీపికా ఆ నెటిజన్ పై సీరియస్ అయ్యింది. దీపికా మాట్లాడుతూ.. ఇలాంటి విషయాలకు నేను స్పందించడం మూర్ఖత్వమే అవుతుంది. నా జీవితంలో నటనకు ఎంత ప్రాధాన్యత ఉందో నాకు తెలుసు. ఇదే విషయం నా భర్తకు కూడా తెలుసు. నేను సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ అస్సలు చదవను. నా సినిమాల గురించి నా భర్తతో చర్చిస్తానా లేదా అనేది నా వ్యక్తిగత విషయం. ఇలాంటి వ్యాఖ్యలు చేసినవారు చాలా తెలివి తక్కువ వారు అనిపిస్తుంది. అదే సమయంలో వారు చిన్న చిన్న విషయాల పట్ల ఎక్కువగా ఆలోచిస్తున్నారు అనిపిస్తుంది అంటూ చెప్పుకోచ్చింది దీపికా.

Also Read: Kajal Aggarwal: మీరు బ్రతకండి.. ఇతరులను బ్రతకనివ్వండి.. బాడీ షేమింగ్ చేసినవారికి కాజల్ స్ట్రాంగ్ ఆన్సర్..

Isha Chawla: ప్రేమకావాలి అంటూ ఒకసారి ఎంట్రీ.. డబల్ ధమాకాతో రీఎంట్రీ..’ఇషాచావ్లా’ న్యూ ఫొటోస్..

Meenakshi Chaudhary: అలాంటి సీన్స్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్న బ్యూటీ..

Hijab Row: చదువుకునే విద్యార్థుల మధ్య మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.. హిజాబ్‌ వివాదం పై స్పందించిన కమల్