AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alia Bhatt: సౌత్ సినిమాల ముందు బాలీవుడ్ ఎందుకు మసకబారింది ?.. షాకింగ్ కామెంట్స్ చేసిన అలియా భట్..

ప్రస్తుతం బీటౌన్ ఇండస్ట్రీలో కఠిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాదికి ఓ హిందీ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలను వేళ్లపై లెక్కపెట్టోచ్చు.

Alia Bhatt: సౌత్ సినిమాల ముందు బాలీవుడ్ ఎందుకు మసకబారింది ?.. షాకింగ్ కామెంట్స్ చేసిన అలియా భట్..
Alia Bhatt
Rajitha Chanti
|

Updated on: Aug 03, 2022 | 10:44 AM

Share

ప్రస్తుతం సినీ పరిశ్రమలో నార్త్ వర్సెస్ సౌత్ ట్రెండ్ సాగుతుంది. గత కొంత కాలంగా బాలీవుడ్ ఇండస్ట్రీ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటుంది. వరుసగా హిందీ చిత్రాలు ప్లాప్ అవుతుండడం దర్శకనిర్మాతలను కలవరపెడుతుంది. చిన్న సినిమాలు కాకుండా స్టార్ హీరోస్ చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద డీలా పడిపోతున్నాయి. గంగూభాయి కతియావాడి, భూల్ భూలయ్యా 2 చిత్రాలు మినహా.. ఇప్పటి వరకు విడుదలైన చిత్రాలన్ని డిజాస్టర్స్ అయ్యాయి. ఇక ఇటీవల రిలీజ్ అయిన రణబీర్ కపూర్ షంషేరా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది. మరోవైపు పుష్ప, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 చిత్రాలు నార్త్ లో భారీ వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించాయి. దీంతో బీటౌన్ పని ఖాతమంటూ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక వార్తలపై హీరోయిన్ అలియా భట్ స్పందించింది.

ప్రస్తుతం బీటౌన్ ఇండస్ట్రీలో కఠిన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాదికి ఓ హిందీ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టిన చిత్రాలను వేళ్లపై లెక్కపెట్టోచ్చు. దక్షిణాదిలో వచ్చిన చిత్రాలు కూడా అన్ని సూపర్ హిట్ కాలేదు. కొన్ని బ్లాక్ బస్టర్ హిట్ అయితే మరికొన్ని అంతగా ఆకట్టుకోలేదు. ఇక్కడ గంగూబాయి కతియావాడి మూవీ మంచి వసూళ్లు రాబట్టింది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు. కోవిడ్ వలన ఏర్పడిన నష్టాల నుంచి చిత్ర పరిశ్రమ ఇంకా బయటపడుతుందని.. ప్రస్తుతం సినీ పరిశ్రమకు ఇది కష్టమైన సమయమని అన్నారు అలియా భట్.

ఇవి కూడా చదవండి

దాదాపు 2 సంవత్సరాలుగా ఇండస్ట్రీ మూతపడిపోయింది. దీంతో థియేటర్లలో ఏ సినిమాలను ప్రేక్షకులు ఆదిస్తారు అనే సందేహాం మొదలైంది. మంచి కంటెంట్ ఉన్న చిత్రాలు ఎప్పుడూ హిట్ అవుతునే ఉన్నాయి. ఓటీటీలలో విడుదల చేసే సినిమాలు.. థియేటర్లలో విడుదల చేసే సినిమాల విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. హిందీ సినిమా పని ఖాతమయ్యింది అనేది నిజం కాదు. ఆ వార్తలలో వాస్తవం లేదు అంటూ చెప్పుకొచ్చింది.