Akshay Kumar: 50 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన హీరోయిన్.. అక్షయ్ కుమార్ ఆసక్తికర పోస్ట్..

|

Jan 17, 2024 | 12:33 PM

అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా వివాహం జరిగి 23 సంవత్సరాలు అవుతుంది. వీరికి కుమారుడు ఆరవ్ (21), కుమార్తె నితారా (11) ఉన్నారు. ట్వింకిల్ దివంగత సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియా పెద్ద కూతురు. ట్వింకిల్ ఖన్నా తెలుగులో వెంకటేష్ నటించిన శీను సినిమాలో నటించింది. 50 ఏళ్ల వయసులో లండన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఈ సందర్భంగా తన భార్యపై ప్రశంసలు కురిపిస్తూ.. ఎమోషనల్ పోస్ట్ చేశాడు హీరో అక్షయ్.

Akshay Kumar: 50 ఏళ్ల వయసులో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేసిన హీరోయిన్.. అక్షయ్ కుమార్ ఆసక్తికర పోస్ట్..
Akshay Kumar, Twinkle Khann
Follow us on

బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సతీమణి ట్వింకిల్ ఖన్నా.. తాజాగా మాస్టర్స్ పూర్తిచేసింది. 50 ఏళ్ల వయసులో లండన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ గ్రాడ్యుయేషన్ పట్టా అందుకుంది. ఈ సందర్భంగా తన భార్యపై ప్రశంసలు కురిపిస్తూ.. ఎమోషనల్ పోస్ట్ చేశాడు హీరో అక్షయ్. తాను ఓ సూపర్ ఉమెన్‏ను పెళ్లి చేసుకున్నానని తనకు అప్పుడే తెలుసని.. ఇల్లు, కెరీర్, పిల్లలు అన్నింటిని చూసుకుంటూ మళ్లీ విద్యార్థిగా మారి చదువు ప్రయాణం కొనసాగించి విజయం సాధించావంటూ నోట్ షేర్ చేస్తూ.. తన భార్య మాస్టర్స్ తీసుకున్న ఫోటోను పంచుకున్నాడు. “రెండు సంవత్సరాల క్రితం మీరు మళ్లీ చదువులు చదవాలనుకుంటున్నారని మీరు నాతో చెప్పినప్పుడు.. మీ నిర్ణయం తెలిసి ఆశ్చర్యపోయాను. కానీ మీరు చాలా కష్టపడి ఇల్లు, కెరీర్, నన్ను, పిల్లలను చూసుకుంటూ.. మళ్లీ పూర్తిస్థాయి విద్యార్థిగా జీవితాన్ని మేనేజ్ చేయడం చూశాకా.. నేను ఒక సూపర్ ఉమెన్ ను వివాహం చేసుకున్నానని నాకు తెలుసు” అంటూ భావోద్వేగ పోస్ట్ చేశాడు.

“ఈ రోజు మీ గ్రాడ్యుయేషన్ సందర్భంగా, టీనా మీరు నన్ను ఎంత గర్వించే భర్తను చేసారో చెప్పడానికి తగినన్ని పదాలు తెలుసుకోవడానికి నేను కొంచెం ఎక్కువ చదువుకోవాలనుకుంటున్నాను. అభినందనలు మై లవ్” అంటూ రాసుకొచ్చారు. అక్షయ్ షేర్ చేసిన ఫోటోలో ట్వింకిల్ ఖన్నా.. ఆకుపచ్చ రంగు చీరలో చిరునవ్వుతో ఎంతో అందంగా కనిపిస్తుంది. తన గ్రాడ్యుయేషన్ గురించి ట్వింకిల్ ఖన్నా ఓ వీడియోను షేర్ చేసింది. “ఇది ఇప్పుడు ఇక్కడ ఉంది. గ్రాడ్యుయేషన్ రోజు.. గోల్డ్‌స్మిత్స్‌లో నా మొదటి రోజు నిన్న, సంవత్సరాల క్రితం జరిగినట్లుగా అనిపిస్తుంది. నా కుటుంబం నాకు మద్దతుగా ఉండడం వలన నేను ఊహించిన దానికంటే ఎక్కువగా ఇది జరిగింది. ఎదగడానికి సులభమైన మార్గం ఉన్నప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. వాటన్నింటిని ఎదుర్కొని ఇతర మార్గాల్లో ఎదుగడానికి మనల్ని మనం సన్నద్ధం చేసుకోవాలి… అంగీకరిస్తున్నారా ?.. అంగీకరించడం లేదా ?” అంటూ రాసుకొచ్చారు.

అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా వివాహం జరిగి 23 సంవత్సరాలు అవుతుంది. వీరికి కుమారుడు ఆరవ్ (21), కుమార్తె నితారా (11) ఉన్నారు. ట్వింకిల్ దివంగత సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా, డింపుల్ కపాడియా పెద్ద కూతురు. ట్వింకిల్ ఖన్నా తెలుగులో వెంకటేష్ నటించిన శీను సినిమాలో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.