12th Fail Movie: సూపర్ హిట్ ’12th ఫెయిల్’ హీరో కష్టాలు.. నెలకు రూ.35 లక్షలు జాబ్ వదిలేసి భార్య సంపాదనపై..
'12th ఫెయిల్' మూవీ హీరో అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇంటర్ ఫెయిల్ అయిన కుర్రాడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఐఏఎస్ ఎలా అయ్యాడనేది చాలా అద్భుతంగా చూపించారు. ఇక ఇందులో మనోజ్ కుమార్ శర్మ పాత్రను పోషించిన విక్రాంత్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ డమ్ అందుకున్న విక్రాంత్ నిజ జీవితంలో మాత్రం ఎన్నో సంవత్సరాల ఎదురుచూపులు.

ప్రతిభ ఉంటే చాలు నటుడిగా నిలదొక్కుకోవడం చాలా సులభం అంటారు.. అందుకు తగిన అదృష్టం కూడా ఉండాలి. టాలెంట్ ఎంత ఉన్నా కాసింత అదృష్టం లేకపోతే ఎన్నో ఏళ్లు గుర్తింపు లేకుండానే ఉండిపోవాల్సి వస్తుంది. కానీ నటుడిగా ఎన్నో అడ్డంకులను .. సవాళ్లను ఎదుర్కొని నిలబడిన వారికి ఒకే ఒక్క సినిమాతో గుర్తింపు వస్తుంది. ఇదే మాటను నిరూపించుకున్నాడు విక్రాంత్ మస్సే. ఈ పేరు చెబితే అంతగా గుర్తుపట్టరు.. కానీ ’12th ఫెయిల్’ మూవీ హీరో అంటే ఠక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇంటర్ ఫెయిల్ అయిన కుర్రాడు ఎన్నో కష్టాలను ఎదుర్కొని ఐఏఎస్ ఎలా అయ్యాడనేది చాలా అద్భుతంగా చూపించారు. ఇక ఇందులో మనోజ్ కుమార్ శర్మ పాత్రను పోషించిన విక్రాంత్ తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ సినిమాతో స్టార్ డమ్ అందుకున్న విక్రాంత్ నిజ జీవితంలో మాత్రం ఎన్నో సంవత్సరాల ఎదురుచూపులు.. మరెన్నో కష్టాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.
హీరోగా వెండితెరకు పరిచయం కాకముందు బుల్లితెరపై పలు సీరియల్స్ చేశాడు విక్రాంత్. అందులో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన చిన్నారి పెళ్లి కూతురు (బాలిక వధు) ఒకటి. ఇందులో శ్యామ్ పాత్రలో నటించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విక్రాంత్ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసుకున్నాడు. “నేను టీవీలో పనిచేసినప్పుడు చాలా డబ్బు సంపాదించాను. 24 ఏళ్ల వయసులోనే సొంతంగా ఇళ్లు కొన్నాను. సీరియల్స్ చేస్తున్న సమయంలో నెలకు రూ. 35 లక్షలు సంపాదించాను. మధ్య తరగతి కుటుంబానికి ఇది చాలా ఎక్కువ. ఇళ్లు కొని.. అప్పు తీర్చి.. నా తల్లిదండ్రులకు మంచి జీవితాన్ని ఇచ్చాను.. కానీ వెండితెరపై నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నాకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. ఆ సమయంలోనే నేను సీరియల్స్ వదిలేశాను. దీంతో నేను దాచుకున్న డబ్బు మొత్తం ఖర్చు అయిపోయింది. సినిమాలకు అడిషన్స్ వెళ్లేందుకు కూడా నా దగ్గర డబ్బులు లేవు. అప్పుడు నా భార్య శీతల్ అడిషన్స్ కోసం డబ్బులు ఇచ్చేది. నటుడిగా సినిమాల్లో అవకాశాల కోసం ఎంతో కష్టపడ్డాను” అంటూ చెప్పుకొచ్చాడు.
17 ఏళ్ల వయసులోనే నటుడిగా బుల్లితెరపై ప్రయాణం ప్రారంభించాడు విక్రాంత్ మాస్సే. దాదాపు ఒక దశాబ్దంపాటు సీరియల్స్ చేశాడు. బుల్లితెరపై సీరియల్స్ చేస్తున్న సమయంలో అనేక కష్టాలు పడ్డాడట. గంట నిడివి ఉండే మహా ఎపిసోడ్ కోసం చాలా గంటలు షూటింగ్ చేసేవారట. కష్టమైన పని షెడ్యూల్స్ ఉండేవని.. విశ్రాంతి లేకుండా 110 గంటలకు పైగా కష్టపడేవాడినని అన్నాడు. చిన్నారి పెళ్లి కూతురు సీరియల్లో తన పాత్రకు కేవలం రెండు నెలలు మాత్రమే ఒప్పందం అని.. కానీ ప్రజలు ఆ పాత్రను ఎంతగానో ప్రేమించి దాదాపు రెండేళ్లపాటు కొనసాగించారని.. తన పాత్రపై.. నటనపై ఉన్న నమ్మకంతో చాలా కాలం పాటు పనిచేశానని అన్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




