Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‎లో పాల్గోన్న సల్మాన్ ఖాన్.. అనర్థాలు ఆగాలంటే చెట్లు పెంచాలంటున్న హీరో… 

|

Jun 23, 2022 | 6:36 AM

మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి.. మొక్కను నాటమా ? పని అయిపోయిందా ? అని కాకుండా మొక్క పెరిగే వరకు శ్రద్ద తీసుకోవాలి.. అకాల వర్షాలు, వరదలు,

Salman Khan: గ్రీన్ ఇండియా ఛాలెంజ్‎లో పాల్గోన్న సల్మాన్ ఖాన్.. అనర్థాలు ఆగాలంటే చెట్లు పెంచాలంటున్న హీరో... 
Salman Khan
Follow us on
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ప్రస్తుతం హైదరాబాద్‏లో సందడి చేస్తున్నారు. ఆయన నటిస్తోన్న కభీ ఈద్ కభీ దివాళీ సినిమా గత కొద్ది రోజులుగా భాగ్యనగరంలోని రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రానికి ఫర్హద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం సినీ కార్మికుల సమ్మె కారణంగా ఆయన  సినిమా షూటింగ్‏కు బ్రేక్ పడింది.. దీంతో విరామ సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్‏లతో కలిసి ఓ ప్రైవేట్ పార్టీలో సందడి చేశారు సల్మాన్..తాజాగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్‏తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‏లో పాల్గోన్నారు.. వీరిద్దరు రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా సల్మాన్ మాట్లాడుతూ.. వాతావరణంలో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమన్నారు.. ఆ పనికి ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా బాటలు వేసారన్నారు..
“మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి.. మొక్కను నాటమా ? పని అయిపోయిందా ? అని కాకుండా మొక్క పెరిగే వరకు శ్రద్ద తీసుకోవాలి.. అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండడం బాధకరమన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమన్నారు.. ఆ పనికి ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ద్వారా బాటలు వేసారు.. ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తే నేలకు, భవిష్యత్ తరాలను కాపాడుకోవచ్చు..నా అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గోని మొక్కలు నాటాలి ” అని కోరారు సల్మాన్.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.