సెలబ్రిటీల పాపులారిటీ విషయంలో సోషల్ మీడియాకు ఎంతో ప్రాధాన్యముంది. నటీనటుటు వీటి ద్వారానే తమ ఫ్యాన్స్‌కు అందుబాటులో ఉంటారు. తమ వృత్తిగత, వ్యక్తిగత విషయాలను పంచుకుంటుంటారు. అప్పుడప్పుడు తమ ఫ్యాషనబుల్ ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తుంటారు. చాలావరకు ఈ పోస్టులకు నెటిజన్ల నుంచి సానుకూల స్పందనే వస్తుంటుంది. కొన్నిసార్లు మాత్రం నెగెటివ్ కామెంట్లు వస్తుంటాయి. విపరీతంగా ట్రోలింగ్‌కు గురవుతుంటారు. ప్రస్తుతం బాలీవుడ్ నటి ఉర్ఫీ జావెద్ ఇలాంటి పరిస్థితే ఎదుర్కొంటోంది. బిగ్‌బాస్‌తో బుల్లితెరపై బోలెడు పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో తరచూ తన ఫ్యాషనబుల్ ఫొటోలు పంచుకుంటుంది. దీంతో ఈ ముద్దుగుమ్మను అనుసరించే ఫాలోవర్ల సంఖ్య ఇటీవల బాగా పెరిగింది.
అసలు దీన్ని డ్రస్ అంటారా…
ఈ క్రమంలో తాజాగా బ్లూ సీ త్రూ డ్రస్‌లో హాట్ హాట్‌గా దర్శనమిచ్చింది ఉర్ఫీ. 10 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో ముందు ఒక డ్రస్‌లో కనిపించి ఆ తరువాత జిప్ తెరచి ఉన్న డ్రస్‌లో దర్శనమిస్తుంది. అయితే ఆ డ్రస్ కాస్త అభ్యంతరకరంగా ఉంది. దీంతో నెటిజన్లు తమ నోటికి పనిచెప్పారు. ‘డ్రస్ బాగుంది కానీ.. ముందు జిప్ వేసుకో’.. ‘అసలు దీన్ని డ్రస్ అంటారా’, ‘ నీ వార్డ్రోబ్ కలెక్షన్ పరమ చెత్తగా ఉంది’, అంటూ నెగెటివ్ కామెంట్లు పెడుతున్నారు. ఉర్ఫీ ట్రోలింగ్‌కు గురవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. కొన్ని రోజుల క్రితం ఓ ఎయిర్‌పోర్ట్‌లో లో దుస్తులు కనిపించేలా డ్రస్ వేసుకుంది. దీంతో నెటిజన్లు తీవ్రంగా ఆమెపై మండిపడ్డారు.
Bigg Boss 5 Telugu: రెచ్చిపోతున్నారు.. హద్దుమీరుతున్నారు.. ఆ ఇద్దరి పై నెటిజన్స్ ఫైర్.. కారణం ఇదే..
Shraddha Arya: నేవీ అధికారితో ఏడడుగులు నడిచిన ‘గొడవ’ ముద్దుగుమ్మ.. నెట్టింట్లో ఫొటోలు వైరల్..
Venkatesh: నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను.. ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకీ మామా..