బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్, డార్లింగ్ ప్రభాస్ ప్రేమలో ఉన్నారనే వార్తలు గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతోన్న విషయం తెలిసిందే. వరుణ్ ధావన్.. చేసిన కొన్ని వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చేకూర్చినట్లైంది. అంతేకాకుండా ప్రభాస్, కృతి కలిసి ఆది పురుష్ చిత్రంలో నటిస్తుండడం, ప్రభాస్ అంటే తనకు ఇష్టమని గతంలో కృతి చేసిన వ్యాఖ్యలు కూడా ఈ వార్తలకు మరింత బలాన్ని ఇచ్చాయి. దీంతో ఈ అంశం ఒక్కసారిగా టాలీవుడ్, బాలీవుడ్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
కొందరైతే ఓ అడుగు ముందుకేసి ఈ జంట వివాహం చేసుకోనుందని, త్వరలోనే నిశ్చితార్థం కానుందని వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తపై అటు ప్రభాస్ కానీ, ఇటు కృతి కానీ స్పందించలేరు. దీంతో వైరల్ అవుతోన్న వార్తకు చెక్ పెట్టాలనుకున్న కృతి సనన్ ఎట్ట కేలకు ఓపెన్ అయ్యింది. తన రిలేషన్ షిప్‌పై వస్తోన్న వార్తలపై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్లారిటీ ఇచ్చేసింది. ఈ విషయమై ఇన్‌స్టా రీల్స్‌లో ఇలా రొసుకొచ్చింది. ‘ఇది ప్రేమ కాదు.. అలాగని పీఆర్ స్టంట్ కూడా కాదు, మా భేడియా అంటే వరుణ్ ధావన్ ఆ రియాలిటీ షోలో కాస్త కావాలని ఇలా మాట్లాడాడు అతని వ్యంగ్యం ఎక్కడికో దారితీసి అనేక రకాల పుకార్లకు ఇప్పుడు తావిస్తోంది. వెబ్‌సైట్స్ మా పెళ్లి తేదీ కూడా ప్రకటించక ముందే నేను ఈ విషయం మీద క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇవన్నీ ఎలాంటి ఆధారాలు లేని పుకార్లు మాత్రమే’ అని స్పష్టతనిచ్చింది.
దీంతో గతకొన్ని రోజులుగా నెట్టింట వైరల్ అవుతోన్న వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లు అయ్యింది. బేధియా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కరణ్ జోహార్ తో బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్ మాట్లాడుతూ కృతి సనన్ మనసు ఇక్కడ లేదు దీపికా పదుకొనేతో నటిస్తున్న ఒక నటుడి వద్ద ఉంది అని కరణ్ చేసిన వ్యాఖ్యలతో ప్రభాస్, కృతిల ప్రేమ వ్యవహారంపై రచ్చ మొదలైన విషయం తెలిసిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..