AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Shiva Nirvana: ఇరుముడి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు.. డైరెక్టర్ కాకముందు శివ నిర్వాణ ఏం చేసేవారో తెలుసా..

ఇరుముడి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ శివ నిర్వాణ. ఇందులో మాస్ మహారాజా రవితేజ, బేబీ నక్షత్ర యాక్టింగ్ హైలెట్ కాగా.. డైరెక్టర్ శివ నిర్వాణ మేకింగ్ మరో ప్రధాన బలం అనే చెప్పాలి. అయితే దర్శకుడిగా మారడానికి ముందు అసిస్టెంట్ డైరెక్టర్ గా దాదాపు 12 ఏళ్లు వర్క్ చేశారట. గతంలో ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు శివ నిర్వాణ.

Director Shiva Nirvana: ఇరుముడి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు.. డైరెక్టర్ కాకముందు శివ నిర్వాణ ఏం చేసేవారో తెలుసా..
Shiva Nirvana
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2026 | 4:05 PM

Share

మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ సూపర్ హిట్ మూవీ ఇరుముడి. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ టాక్ అందుకుని దూసుకుపోతుంది ఈ మూవీ. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శివ నిర్వాణ మాట్లాడుతూ ఉపాధ్యాయుడి నుండి సినిమా దర్శకుడిగా మారిన అరుదైన మార్గాన్ని వివరించారు. శివ నిర్వాణ బీ.ఎడ్ పూర్తి చేశారు, టీచింగ్ వృత్తికి క్వాలిఫై అయ్యారు. అయితే, సినిమా పట్ల ఆసక్తి అంతకు ముందే ఉంది. ఉన్నత విద్యను పూర్తి చేయాలనే తన తండ్రి ఆకాంక్షను గౌరవిస్తూ, ఎం.ఎస్సీ కూడా పూర్తి చేసిన తర్వాతే సినీ రంగంలోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. “మా ఫాదర్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు, ప్లస్ మన ఎడ్యుకేషన్ కూడా ఎక్కడో దగ్గర రిఫ్లెక్ట్ అవుతది మనం తీసే సినిమాల్లో” అని ఆయన నమ్మారు. సుమారు పదేళ్ల కాలంపాటు కొనసాగిన పోరాటం, అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన అనుభవం ఆయనకు సినిమా మేకింగ్‌పై లోతైన అవగాహనను అందించాయి. చిన్నతనంలో బాలమిత్ర, చందమామ, బుజ్జాయి వంటి పుస్తకాలు చదివేవాడని, నాల్గవ తరగతి నుండే ఆయన తండ్రి నెలనెలా ఇంటికి తెప్పించేవారని తెలిపారు. ఇంటర్మీడియట్ సమయంలో సబ్బవరంలోని లైబ్రరీలో ఎండమూరి వీరేంద్రనాథ్ నవలలను విస్తృతంగా చదివారు. తులసీదళం వంటి నవలల ద్వారా డ్రామాను ఎలా పండించాలి, కథా నిర్మాణ విధానం ఎలా ఉండాలి అనే విషయాలను తెలుసుకున్నారు. ఆ తర్వాత యద్దనపూడి సులోచనారాణి, కొమ్మనాపెల్లి గణపతిరావు నవలలను కూడా చదివారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

పుస్తకాలను చదివే క్రమంలోనే సినిమాలు చూడటం, పుస్తకాల్లోని కథను సినిమాకు ఎలా అనువదించాలనే విషయంపై అవగాహన పెంచుకున్నారని శివ నిర్వాణ వివరించారు. యండమూరి వీరేంద్రనాథ్ నవలలైన అభిలాష, ఛాలెంజ్ ఉదాహరణలను ప్రస్తావిస్తూ, పుస్తకానికి, సినిమాకు మధ్య ఉండే అనుసంధానాన్ని అర్థం చేసుకున్నానని చెప్పారు. ఈ క్రమంలోనే పుస్తకాల పట్ల ప్రేమ, సినిమాల పట్ల పిచ్చి పెరిగి, సినిమా రంగానికి రావాలనే బలమైన కోరిక ఏర్పడిందని తెలిపారు. తన కథలను, అనుభవాలను స్నేహితులకు చెప్పినప్పుడు వారు ఎంతగానో ఆస్వాదించడాన్ని గమనించి, తాను మంచి కథకుడిని అని గ్రహించానన్నారు. సంస్కృతంలోని “కథితం హి కథః” అంటే బాగా చెప్పబడిందే కథ అనే సూక్తిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి శివ నిర్వాణకు సుమారు 12-13 ఏళ్ల సుదీర్ఘ పోరాటం అవసరమైంది. కృష్ణానగర్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి, సీరియల్స్ నుండి సినిమాల వరకు అనేక ప్రాజెక్టులకు పనిచేశారు. ఈ ప్రయాణంలో ఎదురైన కష్టాలను, నిరాశలను అధిగమించి, ఎప్పుడూ సానుకూల దృక్పథంతోనే ఉన్నానని చెప్పారు. తాను సినిమాల్లో ఉండాలనే లక్ష్యంతోనే వచ్చానని, డైరెక్టర్ అవ్వకపోయినా అసిస్టెంట్ డైరెక్టర్‌గా అయినా కొనసాగాలని భావించానని తెలిపారు. తనతో పాటు కష్టపడి, ఇంకా దర్శకులు కాని తన స్నేహితులను గుర్తు చేసుకుంటూ, తన పోరాటాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని అన్నారు.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

దర్శకుడిగా తొలి అవకాశం కోసం ఎదురుచూసే క్రమంలో అనేక చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఐదారు సంవత్సరాల వ్యవధిలో ఐదారుగురు నిర్మాతలు సినిమా చేస్తామని చెప్పి, వేచి చూసేలా చేసి, చివరికి వెనక్కి తగ్గేవారని వివరించారు. ఎవరూ కావాలని చేయకపోయినా, మనం జీరోగా ఉన్నప్పుడు ఎవరూ గుర్తించరని, మనలో ఎంత విషయం ఉన్నా అది తెలియదని, ఎవరో ఒకరు అవకాశం ఇచ్చే వరకు ఎదురుచూడక తప్పదని అన్నారు. ఈ నిరీక్షణ కాలం చాలా కఠినమైనదని తెలిపారు. దర్శకుడు పరశురామ్ గారి దగ్గర రెండు సినిమాలు చేశాక, తనను తాను పరీక్షించుకోవడానికి శివ నిర్వాణ షార్ట్ ఫిల్మ్‌లు తీయడం మొదలుపెట్టారు. వన్ మోర్ స్మైల్, లవ్ ఆల్జీబ్రా అనే షార్ట్ ఫిల్మ్‌లు యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందాయి. ఈ షార్ట్ ఫిల్మ్‌లు ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాయి. ఈ షార్ట్ ఫిల్మ్‌లు చూసిన శివ తుర్లపాటి అనే అమెరికా NRI, శివ నిర్వాణకు పరిచయమయ్యారు. షార్ట్ ఫిల్మ్స్ కాకుండా నేరుగా సినిమా చేయాలని, తన వద్ద బడ్జెట్ పరిమితులు లేవని, యాభై లక్షల్లో కూడా సినిమా చేయగలనని చెప్పగా, ఒక చిన్న పిల్లలతో 20 లక్షల బడ్జెట్‌లో సినిమా చేసే ఆలోచనతో ఒక కథను వివరించారు. అది ముందుకెళ్ళకపోయినా, శివ తుర్లపాటి, కోన వెంకట్ స్నేహితులు కావడంతో నిన్ను కోరి ఆలోచన కోన వెంకట్ గారికి చేరింది. కోన వెంకట్ గారు ఈ ఐడియాకు ఎంతగానో ఎగ్జైట్ అయ్యి, స్వయంగా వచ్చి పూర్తి కథ విని, రెండు నెలలు స్క్రీన్‌ప్లే అభివృద్ధిలో సహకరించారు. చివరకు నాని గారికి కథ చెప్పగా, ఒకే సిట్టింగ్‌లో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని శివ నిర్వాణ తెలిపారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

Follow Us