AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పంజాబీ ఆంటీ చెప్పిన సీక్రెట్ టిప్ తో సొరకాయ కూర.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తింటారు

సొరకాయలో నీటి శాతం, ఫైబర్ పుష్కలంగా ఉండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే సాధారణంగా ఇంట్లో వండే సొరకాయ పాలు పోసిన కూర లేదా పప్పు కూరలను పిల్లలు పెద్దగా ఇష్టపడరు. అలాంటి సమయంలో నార్త్ ఇండియన్ పంజాబీ దాబా శైలిలో కాస్త కొత్తగా, మసాలా దట్టించి 'సొరకాయ మసాలా గ్రేవీ కర్రీ' చేసి పెడితే నాన్‌వెజ్ ప్రియులు సైతం వదలకుండా తింటారు. 

Phani CH
|

Updated on: Oct 09, 2026 | 8:23 PM

Share
కావలసిన పదార్థాలు: చెక్కు తీసి లావు ముక్కలుగా తరిగిన సగం లేత సొరకాయ, 1 చెంచా శనగపిండి, 2 చెంచాల కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, పావు చెంచా పసుపు, 2 మీడియం సైజు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, మెత్తటి ప్యూరీ చేసిన 2 మీడియం సైజు టమాటాలు, 1 చెంచా ధనియాలు ,  పావు చెంచా జీలకర్ర 4 నుండి 5 పచ్చిమిరపకాయలు, అర చెంచా అల్లం-వెల్లుల్లి పేస్ట్, పావు చెంచా గరం మసాలా పొడి, 1 చెంచా కసూరి మేథీ, వంట నూనె, 2 కప్పుల నీళ్లు ,  కొద్దిగా తాజా కొత్తిమీర తరుగు

1 / 5
తయారీ విధానం: సొరకాయ చెక్కు తీసి మరీ చిన్నగా కాకుండా కాస్త లావు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్లో 1 చెంచా కారం, అర చెంచా ఉప్పు, 1 చెంచా శనగపిండి వేసి ముక్కలన్నింటికీ సమానంగా అంటేలా బాగా కలిపి పక్కన ఉంచాలి. బాండీలో 3 నుండి 4 చెంచాల నూనె వేడిచేసి, ఈ సొరకాయ ముక్కలను వేయాలి. లో ఫ్లేమ్‌లో మూతపెట్టి మగ్గించాలి; సొరకాయలోని నీరంతా బయటకు వచ్చి, ఆ నీరు ఇంకిపోయి నూనె పైకి తేలే వరకు మధ్యమధ్యలో కలుపుతూ ఉడికించి ప్లేట్‌లోకి తీసుకోవాలి.

2 / 5
మిక్సీ జార్‌లో 1 చెంచా ధనియాలు, పావు చెంచా జీలకర్ర, 4-5 పచ్చిమిర్చి వేసి నీళ్లు అస్సలు పోయకుండా కచ్చాపచ్చాగా పొడిలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో మరికొద్దిగా నూనె వేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి. తర్వాత గ్రైండ్ చేసిన ధనియాలు-పచ్చిమిర్చి పొడిని వేసి వేయించాలి. ఆపై అర చెంచా అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేయించాలి.

3 / 5
ఇప్పుడు 2 టమాటాల మెత్తటి ప్యూరీని వేసి నూనెలో రెండు నిమిషాలు మగ్గించాలి. ఆ తర్వాత 1 చెంచా కారం, కొద్దిగా పసుపు, అర చెంచా ఉప్పు, పావు చెంచా గరం మసాలా, పావు చెంచా జీలకర్ర పొడి వేసి మసాలాలన్నీ పచ్చివాసన పోయి నూనె తేలే వరకు వేయించాలి.

4 / 5
మసాలా వేగిన తర్వాత 2 కప్పుల నీళ్లు పోసి కలపాలి. గ్రేవీ మరుగుతున్నప్పుడు చేత్తో నలిపిన కసూరి మేథీని వేయాలి. ఆ తర్వాత ముందుగా వేయించి ఉంచుకున్న సొరకాయ ముక్కలన్నింటినీ వేసి కలపాలి. మూతపెట్టి మీడియం మంటపై గ్రేవీ చిక్కబడి నూనె పైకి తేలే వరకు 2 నుండి 3 నిమిషాలు ఉడికించాలి. చపాతీ, పూరీల్లోకి కావాలనుకుంటే ఈ సమయంలో అర కప్పు చిలికిన పెరుగును కూడా జోడించుకోవచ్చు. చివరగా తాజా కొత్తిమీర తరుగు చల్లి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే పంజాబీ స్టైల్ 'సొరకాయ మసాలా గ్రేవీ కర్రీ' సిద్ధం! వేడివేడి అన్నంలో కలుపుకుని తిన్నా, చపాతీ లేదా పుల్కాల్లోకి నంజుకున్నా అమృతంలా ఉంటుంది.

5 / 5
Follow Us