AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర రోడ్డు ప్రమాదం.. 100 అడుగుల లోయలో పడిన వాహనం.. ఇద్దరు మృతి, ఐదుగురికి సీరియస్!

జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా మొగ్లా-ధర్మశాల్ ప్రాంతంలో ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక క్యాంటర్ వాహనం అదుపుతప్పి సుమారు 100 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి గాయాలపాలయ్యారు.

ఘోర రోడ్డు ప్రమాదం.. 100 అడుగుల లోయలో పడిన వాహనం.. ఇద్దరు మృతి, ఐదుగురికి సీరియస్!
Vehicle Skids Off Road
Balaraju Goud
|

Updated on: Oct 09, 2026 | 9:07 PM

Share

రాజౌరీ: జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీ జిల్లా మొగ్లా-ధర్మశాల్ ప్రాంతంలో ఒక విషాదకరమైన రోడ్డు ప్రమాదం జరిగింది. 22 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఒక క్యాంటర్ వాహనం అదుపుతప్పి సుమారు 100 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరు మరణించగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరికి గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే, గాయపడిన వారిని రాజౌరీలోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC)కు తరలించారు, అక్కడ వారికి చికిత్స అందుతోంది.

అందిన సమాచారం ప్రకారం, క్యాంటర్‌లో ప్రయాణిస్తున్న వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. ఒక మరణం కారణంగా సంతాపం తెలిపేందుకు మరొక కుటుంబం ఇంటికి వెళ్లేందుకు వారు ఈ వాహనాన్ని అద్దెకు తీసుకున్నారు. తిరిగి వస్తుండగా, మొగ్లా-ధర్మశాల్ ప్రాంతంలో వాహనం అదుపు తప్పి లోతైన లోయలో పడిపోయింది.

ప్రమాదం గురించి సమాచారం తెలిసిన వెంటనే స్థానికులు, పోలీసులు మరియు అధికార యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి, బాధితులను లోయ నుండి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. ఈ విషాద ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us