
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తుది దశకు చేరుకుంది. సెప్టెంబర్ 07న ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే పదో వారం ఎండింగ్ కు చేరుకుంది. ఇక ఈ సీజన్ లో కేవలం ఆరు వారాలు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ షోపై ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరుతోంది. దీనికి తోడు పదో వారం నామినేషన్స్ ఈ సీజన్ లో ఎప్పుడూలేనంత ఉత్కంఠగా సాగాయి. ప్రస్తుతం హౌస్ లో ఉన్న మొత్తం 11 మంది కంటెస్టెంట్స్ లో ఏకంగా పది మంది నామినేట్ అవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. కెప్టెన్ ఇమ్మాన్యుయేల్ మినహా హౌస్‌మేట్స్ అందరూ నేరుగా నామినేషన్స్ లోకి రావడంతో ఈ వారం ఎలిమినేషన్ పై ఉత్కంఠ తీవ్ర స్థాయికి చేరుకుంది. తనూజ పుట్టస్వామి, డీమాన్ పవన్, భరణి శంకర్, దివ్య నిఖిత, రీతూ చౌదరి, గౌరవ్ గుప్తా, సంజనా గల్రానీ, కళ్యాణ్ పదాల, నిఖిల్ నాయర్, సుమన్ శెట్టి ఈ వారం నామినేషన్స్ లో కొనసాగుతున్నారు. ఈ సీజన్ లో ఇప్పటివరకు జరిగిన అతి పెద్ద నామినేషన్స్ ఇదే కావడం గమనార్హం.
కాగా ఈ సారి 10 మంది కంటెస్టెంట్స్ నామినేట్ కావడం, అందులోనూ టాప్ కంటెస్టెంట్స్ ఉండడంతో ఓటింగ్ భారీ స్థాయిలో జరుగుతోంది. లేటెస్ట్ సోషల్ మీడియా ఓటింగ్ ట్రెండ్స్ ప్రకారం పడాల కల్యాణ్ టాప్ ప్లేస్ లో కొనసాగుతున్నాడు. మరో టాప్ కంటెస్టెంట్ తనూజ రెండో స్థానానికి పడిపోయింది. మొన్నటివరకు లీస్ట్ లో ఉన్న రీతూ చౌదరి ఇప్పుఉ మూడో ప్లేస్ కు వచ్చేసింది. అలాగే భరణి శంకర్ సేఫ్ జోన్ లోకి వచ్చేశాడు. ప్రస్తుతం అతను నాలుగో ప్లేసులో కొనసాగుతుండడం గమనార్హం. ఇక ఊదో స్థానంలో గౌరవ్ గుప్తా, ఆరో ప్లేసులో సుమన్ శెట్టి, ఏడో స్థానంలో సంజనా, ఎనిమిదో ప్లేసులో దివ్య నికితా కొనసాగుతున్నారు.
ఇక చివరి రెండు స్థానాల్లో డీమాన్ పవన్ (9వ ప్లేస్), నిఖిల్ నాయర్ (10వ స్థానం)లో ఉన్నారు. అంటే ప్రస్తుతం వీరిద్దరు డేంజర్ జోన్ లో ఉన్నారన్నమాట. మరికొన్ని గంటల్లో (శుక్రవారం అర్ధరాత్రి వరకు) బిగ్ బాస్ ఓటింగ్ ముగియనుంది. అంటే పవన్, నిఖిల్ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. డీమాన్ పవన్ కు అభిమానుల మద్దతు ఉంది కాబట్టి నిఖిల్ ఈ వారం హౌస్ నుంచి బయటకు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.