Bigg Boss Season 7: విర్రవీగితే.. బొక్కబోర్లా పడడం ఖాయం.. గౌతమ్‌ తలపొగరు దించిన లేడీ పులి శోభ.. టాస్క్‌ మాజా ఆయా ..🥳

|

Sep 22, 2023 | 12:29 AM

తాజా ఎపిసోడ్ అంటే 19th ఎపిసోడ్‌లోనూ.. ఇదే గేమ్‌ను కంటిన్యూ చేస్తాడు బిగ్ బాస్. ప్రిన్స్ తర్వాత శోభకు.. శోభను కంటెండర్‌ గా వ్యతిరేకిస్తూ ఓటేసిన వాళ్లకు మధ్య స్పైసీ చికెన్ టాస్క్ ఇస్తాడు. ముందుగా శోభను పిలిచి..స్పైసీగా ఉన్న చికెన్ ముక్కలను వీలైనన్ని తిని.. ఓ బెంచ్ మార్క్‌ సెట్ చేయమంటాడు. తను తినడం పూర్తయ్యాక.. తనను ఛాలెంజ్‌ చేసిన సుబ్బు, రైతు బిడ్డ ప్రశాంత్, గౌతమ్‌కు కూడా అదే చేయాల్సింది గా ఆదేశిస్తాడు. అయితే ఈ టాస్క్‌లో.. స్పైసీ చికెన్‌ను త్వరగా తిన్న గౌతమ్‌ విజేతగా గెలుస్తాడు..

Bigg Boss Season 7: విర్రవీగితే.. బొక్కబోర్లా పడడం ఖాయం.. గౌతమ్‌ తలపొగరు దించిన లేడీ పులి శోభ.. టాస్క్‌ మాజా ఆయా ..🥳
Follow us on

ఉల్టా పల్టా.. అంటూ.. ఈసీజన్ కాస్త తేడాగానే సాగుతుందంటూ.. ముందే చెప్పేసిన బిగ్ బాస్, చెప్పినట్టే.. చేస్తున్నారు. హౌస్‌లో ఉన్న వారందరికీ కంటెండర్ టాస్క్‌లు ఇస్తూ.. కన్ఫర్మ్డ్‌ ఇంటి సభ్యులుగా మారేందుకు కఠిన పరీక్షలు పెడుతున్నారు. హౌస్ సభ్యుల ఓపికకు పరీక్ష పెడుతూ.. బీబీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఇక నిన్నటి అంటే 18th ఎపిసోడ్‌లో కంటెండర్స్ గా ప్రిన్స్, శోభ, అమర్‌ దీప్‌లను అనౌన్స్ చేసిన బిగ్ బాస్.. వారిని ఛాలెంజ్ చేసిన కంటెస్టెంట్స్‌తో వారికే ఛాలెంజ్‌ విసిరేలా చేశారు. ఇక ఈ క్రమంలోనే కంటెండర్‌ గా అర్హత లేదంటూ.. ప్రిన్స్‌కు ఛాలెంజ్‌ విసిరిన రతిక, తేజు, దామిని.. మధ్యలో ఓ టాస్క్‌ పెట్టాగా.. ఆ ముగ్గురి అడ్డును తొలిగించుకుని మరీ ప్రిన్స్ టాస్క్లో నిరూపించుకుటాడు. కంటెండర్‌ గా తనకే అన్ని అర్హతలు ఉన్నాయంటూ నిరూపించుకుంటాడు.

ఇక తాజా ఎపిసోడ్ అంటే 19th ఎపిసోడ్‌లోనూ.. ఇదే గేమ్‌ను కంటిన్యూ చేస్తాడు బిగ్ బాస్. ప్రిన్స్ తర్వాత శోభకు.. శోభను కంటెండర్‌ గా వ్యతిరేకిస్తూ ఓటేసిన వాళ్లకు మధ్య స్పైసీ చికెన్ టాస్క్ ఇస్తాడు. ముందుగా శోభను పిలిచి..స్పైసీగా ఉన్న చికెన్ ముక్కలను వీలైనన్ని తిని.. ఓ బెంచ్ మార్క్‌ సెట్ చేయమంటాడు. తను తినడం పూర్తయ్యాక.. తనను ఛాలెంజ్‌ చేసిన సుబ్బు, రైతు బిడ్డ ప్రశాంత్, గౌతమ్‌కు కూడా అదే చేయాల్సింది గా ఆదేశిస్తాడు. అయితే ఈ టాస్క్‌లో.. స్పైసీ చికెన్‌ను త్వరగా తిన్న గౌతమ్‌ విజేతగా గెలుస్తాడు. సంచాలుకుడిగా ఉన్న సందీప్ ఇదే అనౌన్స్‌ చేస్తాడు. కానీ కట్ చేస్తే.. మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఇస్తాడు బిగ్ బాస్.

శోభు 27 చికెన్ పీసులు తినిందన్న బిగ్ బాస్.. ఆ మార్క్‌ను మించేలా అంటే 28 లేదా ఆ పైనే చికెన్ సీసులు తినాలని టాస్క్‌లో రూల్ గా చెబుతాడు. కానీ అప్పటిగే ఈ టాస్క్‌లో గెలిచా అంటూ.. హంగామా చేస్తున్న గౌతమ్.. కేవలం 27 పీసులే తిన్నాడని.. అంటే.. శోభ సెట్ చేసిన బెంచ్ మార్క్‌ను బీట్ చేయలేదని బిగ్ బాస్ చెబుతాడు. ఇక ఈ కారణంగా.. కంటెండర్‌ గా శోభనే గెలిచినట్టు అనౌన్స్ చేస్తాడు. దీంతో గౌతమ్‌ షాక్‌లో… శోభ సెలబ్రేషన్స్‌లో మునిగితేలుతుంది.

ఇవి కూడా చదవండి

అయితే స్పైసీ చికెన్ కంటెండర్ టాస్క్‌ జరుగుతున్నంత సేపు.. ఇంతకు ఎపిసోడ్‌లో గౌతమ్, శోభ మధ్య జరిగిన ఫైట్ సీనే బీబీ లవర్స్‌కు గుర్తుకు వస్తుంది. వారి ఫైట్లో శోభ ముందు షర్ట్ విప్పి మరీ ఛాలెంజ్ చేసిన గౌతమ్ తీరు.. తనపై విమర్శలు వచ్చేలా చేసింది. ఇక ఈకమ్రంలోనే వీరి మధ్య జరిగిన టాస్క్లో ముందు గౌతమ్‌ గెలవడం.. కాదు కాదు.. శోభనే గెలిచిందని తేలడంతో.. మన డాక్టర్ బాబు తలపొగరు ఒక్కసారగా దిగినట్టైంది. విర్రవీగితే బొక్కబోర్లా పడడం ఖాయం అనే సామెత..ఈ రెండు ఎపిసోడ్స్ చూసిన వారికి ఖచ్చితంగా అనిపిస్తుంది కూడా..!

మళ్లీ బిగ్ బాస్ హౌస్‌కి ఎంటర్ అయితే.. ‘బావ మనోభావాలు దెబ్బతింటాయే’ అనే మాసీ సాంగ్స్‌తో ఫుల్ ఎనర్జిటిక్‌గా నిద్రలేచిన కంటెస్టెంట్స్‌.. అదే ఎనర్జీతో.. హౌస్‌లో చిట్ చాట్ చేస్తూనే ఉంటారు. ఇక ఈ క్రమంలోనే శోభ.. హౌస్‌లో అబ్బాయిలు కొంత మంది షర్ట్ విప్పి తిరగడాన్నితప్పుబడుతుంది. శివాజీతో ఇదే విషయం చెబుతూ కాస్త బాధపడుతుంది. ఇక మరో పక్క తేజ వల్లే.. కంటెండర్ టాస్క్‌లో ఓడిపోయామని దామిని ఫీలవుతూ ఉంటుంది. ఇంకో పక్క ‘రతికా ఏం చేసింది బ్రో’.. అంటూ.. అమర్ దీప్ సందీప్‌తో దీర్ఘాలు తీస్తూ ఉంటారు.

ఇక టాస్క హడావిడిలో కంటెస్టెంట్స్ అందరూ ఉండగానే.. అమర్‌ దీప్.. శివాజీ పవరాస్త్రను శివాజీకే ఇచ్చి సారీ చెబుతాడు. శివాజీ కూడా ‘నువ్వు చిన్న పిల్లాడివా’ అంటూ.. అమర్ దీప్‌ను దగ్గరికి తీసుకుని తన వార్నింగ్ లొల్లిని ఖతం చేస్తాడు.

ఇక ఈ కంటెస్టెంట్ ఇలా.. ఎవరి బాతాకానీ వారు పెట్టుకుంటూ ఉండగా.. బిగ్ బాస్ మరో కంటెండర్‌ టాస్క్ గురించి చెబుతారు. కంటెండర్‌గా నిరూపించుకునేందుకు అమర్‌ దీప్ తన జుట్టును సాక్రిఫైజ్‌ చేయాలని ఆదేశిస్తాడు. అయితే అందుకు అమర్ దీప్ నాట్ ఓకే అనడంతో.. ప్రియాంక ఓకే అంటుంది. బిగ్ బాస్ పంపిన ఫోటోలో ఉన్నట్టు.. తాను గుండు చేసుకోలేను అని అమర్ దీప్ అంటుండగా.. బాబీ కట్‌లో తాను పర్లేదు అనుకుంటూ..అంటూ ప్రియాంక టాస్క్‌ యాక్సెప్ట్ చేస్తుంది. టాస్క్‌ సక్సెస్‌ ఫుల్‌గా ఫినిష్ కూడా చేస్తుంది. కానీ కాస్త ఎమోషనల్‌గా…!

ఇక ఈ టాస్క్‌కు ముందు అమర్‌ దీప్.. తన హెయిర్ తీయడం ఇష్టం లేదని.. రవితేజ తన ఫెవరెట్ హీరో అని.. తను తన జుట్టు టచ్ చేసి.. తన జుట్టులానే ఉందని మెచ్చుకున్నారని.. అందకే జుట్టు తీయను అని చెబుతుంటాడు. మరొకసారి తన తన నెత్తిపై స్టిచెస్ ఉన్నాయని.. అందుకే హెయిర్ తీసేయనని చెబుతాడు. ‘జుట్టే కదా బ్రో.. మళ్లీ వస్తుంది కదా’ అని.. మనోడి మాటలను తేజు ఇంకోపక్క కామెడీ చేస్తుంటాడు.

ఇక బీబీ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ హెల్ప్‌తో.. హెర్ కట్ చేయించుకున్న ప్రియాంక.. తన లుక్‌తో అందర్నీ మెస్మరైజ్‌ చేస్తుంది. తన సాక్రిఫైజ్‌తో బిగ్ బాస్‌ ను కూడా ఇంప్రెస్ చేసి.. వన్‌ ఆఫ్ ది కంటెడర్ పోటీదారులుగా ఎన్నికవుతుంది. దీంతో బిగ్ బాస్ మూడవ పవరాస్త్ర కోసం పోటీ పడే కంటెడర్ పోటాదారులుగా.. ప్రిన్స్, శోభ, ప్రియాంకను అనౌన్స్ చేస్తారు బిగ్ బాస్. కంటెండర్ బ్యాడ్జ్‌లను కూడా మార్చుకోమని ఆదేశిస్తారు. అలా ఈ బిగ్ బాస్ సీజన్ 7 ఎపిసోడ్ సాల్ట్ అండ్ పెప్పర్‌లా.. ముగిస్తుంది.

 

                                                                                                                       – సతీష్ చంద్ర (ఈటీ ప్రొడ్యూసర్)

 

 

 

మరిన్ని బిగ్‌బాస్‌-7 కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి